నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డే సందర్భంగా... ఇంధన పొదుపు వారోత్సవాలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు దీ ఇన్స్టిట్యూషన్ ఇంజినీర్స్ తెలంగాణ రాష్ట్ర సెంటర్ తెలిపింది. ఈనెల 14 నుంచి 20 వరకు ఉత్సవాలు జరుగుతాయని సెంటర్ ఛైర్మన్ డాక్టర్ జి. రమేశ్వర్ రావు తెలిపారు. మొదటి రోజు 14న ఖైరతాబాద్‌లోని ఇంజినీర్ భవన్లో ఇంధన పొదుపుపై జరిగే సదస్సులో కాలేజీ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
15న నెక్లెస్ రోడ్లో నిర్వహించే ఇంధన పొదుపుపై అవగాహన పరుగులో పలువురు మంత్రులు, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొంటారని చెప్పారు. ఇదే విషయంపై 16 నుంచి 19 వరకు పాఠశాల విద్యార్థులకు క్వీజ్, వ్యాస రచన, చిత్ర లేఖ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చివరి రోజు 20న విశ్వేశ్వరయ్య భవన్లో జరిగే బహుమతుల ప్రధానోత్సవంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి హాజరుకానున్నారని పేర్కొన్నారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం... సేవ్ ఎనర్జీ... సేవ్ హెర్త్... సేవ్ వాటర్... సేవ్ లైఫ్ పేరుతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య సంఘం