ETV Bharat / state

ఇంట్లో ఉంటే స్వర్గ లోకం... బయటకి వస్తే యమలోకం

author img

By

Published : Mar 31, 2020, 10:09 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా డోన్​లో వినూత్నంగా యముడు, చిత్రగుప్తుడు, భటుడు తదితరుల వేషధారణలతో ప్రజలకు అవగాహన కల్పించారు.

Innovative campaign on Corona with Yamudu, Chitragupta and Bhadu
ఇంట్లో ఉంటే స్వర్గ లోకం... బయటకి వస్తే యమలోకం

కరోనా నియంత్రణకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. కరోనా కట్టడికి ఏపీలోని కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వినూత్నంగా యముడు, చిత్రగుప్తుడు, భటుడు తదితర వేషధారణలతో ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించారు. ఇంట్లో ఉంటే స్వర్గ లోకం, బయటకి వస్తే యమలోకం అంటూ యముడు పుర వీధులగుండా తిరుగుతూ ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించారు. ఇంట్లో ఉంటే జనాభా లెక్కల్లో ఉంటావు.. బయటకు వస్తే కరోనా లెక్కల్లో ఉంటావని పేర్కొన్నారు. బయట తిరుగుతున్న వ్యక్తులకు యమపాశం వేసి బయట తిరిగితే యమలోకానికి తీసుకెళ్తానని హెచ్చరించారు. అందరూ లాక్​డౌన్​ను పాటించాలని, అవసరముంటేనే గానీ బయటకు రావొద్దని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. బయటకు వచ్చినపుడు సామాజిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి: 'మర్కజ్​కు వెళ్లొచ్చిన ప్రతిఒక్కరూ సమాచారం ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.