యువతలో ఉన్న సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాన్ని బయటకు తీయడానికి డీఆర్డీవోతో కలిసి కేంద్రం... దేశవ్యాప్తంగా 5 యంగ్ సైంటిస్ట్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ రామంతపూర్‌లోని సీడీటీఐ భవన్లో సైబర్ రీసెర్చ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్‌ను ప్రారంభించారు.
సాంకేతికతతో జీవనం సాఫీగా మారినా... సైబర్ సెక్యూరిటీ ఛాలెంజ్‌గా మారుతున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు. సైబర్ క్రైమ్స్‌ను అరికట్టడానికి కేంద్రం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. హైదరాబాద్‌లో టాప్ ఐటీ కంపెనీలతో పాటు నేషనల్ డిఫెన్స్ సెంటర్లున్నాయని.. వాటి భాగస్వామ్యంతో ఈ సెంటర్ పనిచేయాలని సూచించారు
సైబర్ క్రైమ్, సైంటిఫిక్ టెక్నిక్స్‌తో పాటు ఫోరెన్సిక్‌పై పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వడానికే ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామని.. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ కరుణ సాగర్ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులతో పాటు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ అధికారులకు సైబర్ క్రైమ్‌తో పాటు సాంకేతిక అంశాలు, మెలకువలపై ఈ సెంటర్లో శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు.
- ఇదీ చూడండి : నమస్తే ట్రంప్: పర్యటన తొలిరోజు హైలైట్స్