ETV Bharat / state

గోవింద్​పూర్​లో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్ - FOOD PROCESSING PLANT

సంగారెడ్డి జిల్లాలో హాట్సన్ అగ్రో ప్రోడక్ట్స్ సంస్థ దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు నిర్మాణానికి సంబంధించి పనులు శరవేగంగా సాగుతున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

indias-largest-ice-cream-plant-in-govindpur
గోవింద్​పూర్​లో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్
author img

By

Published : Feb 13, 2020, 8:30 AM IST

Updated : Feb 13, 2020, 10:04 AM IST

హాట్సన్ అగ్రో ప్రోడక్ట్స్ సంస్థ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్​కి సంబంధించి 207 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. సంగారెడ్డి జిల్లా గోవింద్​పూర్​లో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం తయారీ ప్లాంట్​ను సదరు సంస్థ ఏర్పాటు చేయనుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్లాంట్ నిర్మాణానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ప్లాంట్​తో దాదాపు స్థానికంగా ఉన్న 4000 పాడి రైతు కుటుంబాలకు ప్రయోజనంతోపాటు సుమారు 500 మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు వస్తాయని వెల్లడించారు. రోజు వంద మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ సిద్ధమవుతోందని కేటీఆర్ వివరించారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తై ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో బలహీన వర్గాలకు అన్యాయం'

Last Updated : Feb 13, 2020, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.