Independence Diamond Jubilee Closing Ceremony in Telangana : రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు(Swatantra Bharata Vajrotsavaalu) నేటితో ముగియనున్నాయి. హైదరాబాద్ హెచ్ఐసీసీ(HICC) వేదికగా మధ్యాహ్నం జరగనున్న ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రారంభ వేడుకలను 'స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ పేరిట నిరుడు ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
CM KCR At Independence Diamond Jubilee Closing Ceremony : ఆగస్టు 8న హెచ్ఐసీసీ వేదికగా వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ సమారోహం ఘనంగా జరిగింది. ప్రతి రోజు ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. రిచర్డ్ అటెన్ బరో నిర్మించి దర్శకత్వం వహించిన గాంధీ సినిమాను రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో విద్యార్థుల కోసం రెండు దఫాలుగా ఉచితంగా ప్రదర్శించారు. ఫ్రీడం కప్ పేరిట ఆటల పోటీలు, ప్రత్యేక ర్యాలీలు, ఫ్రీడమ్ రన్, రాష్ట్రమంతటా ఏకకాలంలో, ఎక్కడివాల్లక్కడ ‘తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు.
Swatantra Bharata Vajrotsavalu Closing Ceremony : స్వాతంత్య్ర సమరం ఇతివృత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కవి సమ్మేళనాలు, ముషాయిరాలు నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి.. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆయా రంగాల్లో ఉత్తమ పనితీరును కనబరచిన వారిని గుర్తించి అవార్డులు అందించారు. ఇటీవల ముగింపు వేడుకల్లో భాగంగా కూడా కోటి వృక్షార్చన పేరిట ఒకే రోజు కోటి 30 లక్షల మొక్కలు నాటారు. ఇవాళ జరగనున్న ముగింపు వేడుకలతో వజ్రోత్సవాలు సుసంపన్నం కానున్నాయి.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్
స్వతంత్ర వజ్రోత్సవంలో భాగంగా కోటి మొక్కలు నాటిన ప్రభుత్వం : స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26న కోటి మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. హరితహారంలో భాగంగా కోటి మొక్కలను నాటారు. ఇప్పటికే హరితహారం కార్యక్రమం మొదటి నుంచి.. ఇప్పటివరకు 230 లక్షల కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించుకుంటే ఆ టార్గెట్ను దాటి 270 లక్షల కోట్ల మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. ఇది స్వతంత్ర వజ్రోత్సవాలకు తెలంగాణ ఇచ్చే కానుకగా వర్ణించారు.