ETV Bharat / state

లాక్‌డౌన్‌ భయంతో నిత్యావసరాల కోసం ‘క్యూ’లు

హైదరాబాద్​లో మళ్లీ లాక్​డౌన్ విధిస్తారనే ప్రచారంలో నిత్యావసరాల కోసం గత ఐదు నాలుగు రోజులుగా దుకాణాల వద్ద ప్రజల బారులు తీరుతున్నారు. కొన్నిపెద్ద మార్కెట్లను తాత్కాలికంగా మూసివేయడంతో పలుచోట్ల సరకుల కొరత నెలకొంటోంది. ప్రజలు నెలన్నర రెండు నెలలకు సరిపోయేలా సరకులు కొనుగోలు చేస్తున్నారు.

hyderabad lock down
hyderabad lock down
author img

By

Published : Jul 3, 2020, 10:03 AM IST

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారంతో.. ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిత్యావసరాల కోసం గత నాలుగు రోజులుగా దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. పెద్దఎత్తున కొనుగోళ్లు చేస్తున్నారు. కొన్ని పెద్ద మార్కెట్లను తాత్కాలికంగా మూసివేయడంతో పలుచోట్ల సరకుల కొరత నెలకుంటోంది. సాధారణంగా నెల మొదటి వారంలో రద్దీ ఉండే సూపర్‌ మార్కెట్లలో జూన్‌ నెలాఖరులోనే తీవ్రమైన రద్దీ నెలకొంది. గత సోమవారం నుంచి మార్కెట్ల వద్ద ఉదయం నుంచి భారీ క్యూలు ఉంటున్నాయి.

ప్రజలు నెలన్నర రెండు నెలలకు సరిపోయేలా సరకులు కొనుగోలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరోమారు లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందనే సమాచారం నేపథ్యంలోనే ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల పలు ప్రాంతాలకు నిత్యావసర సరకులు, ఇతర వస్తువులు ప్రధానంగా బేగంబజార్‌ నుంచి సరఫరా అవుతాయి. బేగంబజార్‌ మార్కెట్‌ గత ఐదు రోజులుగా మూతపడటంతో పలు కిరాణా దుకాణాల్లో సరకులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వ్యాపారులు తెలిపారు.

మందులూ ముందుగానే

కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అవసరమైన మందులనూ ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ విధిస్తే మందుల కొనుగోలులో సమస్యలు ఉంటాయని భావించి, నెల, రెండు నెలలకు అవసరమైన మందులను ఒకేసారి కొనితెచ్చుకుంటున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.