విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన పింఛన్లు అందాయి. జూన్ నెలకు సంబంధించి వేతన సవరణ ప్రకారం పెరిగిన పింఛను మొత్తాన్ని పెన్షనర్లు అందుకున్నారు. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన బకాయిలను విడిగా ఇస్తారు. అటు ఉద్యోగులకు మాత్రం పాత వేతనాలే అందాయి. వేతనసవరణ అమలు ప్రక్రియ, కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకోవడం, ఆమోదం తదితరాలకు సంబంధించిన కసరత్తు బిల్లులు రూపొందించే వరకు పూర్తి కాలేదు.
దీంతో జూన్ నెల జీతానికి వారికి పీఆర్సీ అమలు కాలేదు. అనుబంధ బిల్లు రూపొందించి వీలైనంత త్వరగా ఈ నెలలోనే మిగిలిన మొత్తాన్ని కూడా అందిస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. జూలై నెల వేతనం మాత్రం అందరికీ వేతనసవరణకు అనుగుణంగానే అందుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగానే రెండు నెలల బకాయిలు ఇవ్వనుంది.
ఇదీ చదవండి: CM KCR TOUR: ముఖ్యమంత్రి రాకకోసం ముస్తాబవతున్న సిరిసిల్ల