ETV Bharat / state

గాంధీకి కరోనా తాకిడి.. వైద్యులపై పెరుగుతున్న ఒత్తిడి - గాంధీ ఆస్పత్రి తాజా వార్తలు

గాంధీ ఆస్పత్రికి కరోనా రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వైద్యులు, వైద్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. దానివల్ల వారిపై ఎక్కువగా ఒత్తిడి పెరుగుతోంది. వైద్యులపై ఒత్తిడి తగ్గిస్తేనే మరింత మంది బాధితులకు సేవలు చేయొచ్చని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు.

full of corona patients in gandhi
గాంధీకి కరోనా తాకిడి
author img

By

Published : Jun 2, 2020, 9:14 AM IST

రోనా బాధితులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో గాంధీ ఆస్పత్రి చరిత్రాత్మక పాత్ర పోషిస్తోంది. ప్రాణాలకు తెగించి వైద్యులు, సిబ్బంది రోగుల సేవల్లో నిమగ్నం అయ్యారు. వ్యక్తిగత జీవితాలనూ కోల్పోతున్నా కర్తవ్య దీక్షలో ఎక్కడా వెనుకాడటం లేదు. అయితే నగరంలో కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు అత్యవసర కేసులను తిరస్కరిస్తున్నాయి. వెంటిలేటర్లు ఖాళీగా లేవని, పడకలు అందుబాటులో లేవని.. ఇలా రకరకాల కారణాలను సాకుగా చూపి రోగులను చేర్చుకోవడం లేదు. జ్వరం, జలుబు, దగ్గు ఉంటే చాలు గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో వచ్చే వారిలో దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడే వారే ఎక్కువ. క్యాన్సర్‌, కిడ్నీల వైఫల్యం, మధుమేహం, అధిక రక్తపోటు తదితర సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అత్యవసర వైద్యం సకాలంలో అందకపోతే ఇబ్బందే.

తాకిడి పెరుగుతోంది

రానున్న రోజుల్లో నగరంలో ఈ బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే గాంధీ ఆస్పత్రిలో పడకలు పూర్తిగా ఆ రోగులతోనే నిండిపోతాయి. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులు నిరాకరిస్తున్న అత్యవసర కేసులూ గాంధీకి వస్తున్నాయి. కొవిడ్‌-19 లక్షణాలు లేని వారిని ఉస్మానియాకు పంపుతున్నారు. ప్రస్తుతం ఉస్మానియాలో నిత్యం ఓపీ తాకిడి 1100-1200 వరకు ఉంటోంది.

మూడు షిఫ్టుల్లో విధులు

గాంధీ ఆసుపత్రిలో మూడు షిఫ్ట్‌ల్లో వైద్యులు, సిబ్బంది పని చేస్తున్నారు. 24 గంటలపాటు సేవలందించిన వైద్యులు 5 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండి మళ్లీ విధులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో రోజురోజుకి కరోనా బాధితులు పెరుగుతుండటం ఇక్కడి వైద్యులు, నర్సులు, నాలుగో తరగతి సిబ్బందిపై పని ఒత్తిడి పెంచుతోంది. ఈ పరిస్థితుల నుంచి ‘గాంధీ’పై ఇతర అత్యవసర కేసుల ఒత్తిడిని తగ్గించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

గాంధీ ఆస్పత్రిలో సేవలు ఇలా..

304 : మూడు రోజులుగా చేరిన కరోనా రోగులు
500 : ఇప్పటికే చికిత్స పొందుతున్న వారు
46: ఐసీయూలో ఉన్న కరోనా బాధితులు
1500: కొవిడ్‌-19 చికిత్సలు చేయగల గరిష్ఠ సామర్థ్యం

ఇవీ చూడండి: నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.