దేశంలో ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతున్నారనే ప్రధాని మోదీ... పన్నులు పెంచకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. కరోనా కాలంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఖాతాల్లో డబ్బులు జమచేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. భాజపా, లఘు ఉద్యోగ్ భారతీ సంయుక్తంగా హైదరాబాద్లోని ఓ హోటల్‌లో బడ్జెట్- 2021పై మేధావులు, పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మేధావులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. రైతులను తప్పుదారి పట్టిస్తూ.. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకమైనవిగా ప్రచారం చేస్తున్నారని అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్టప్‌లకు ఇన్కం ట్యాక్స్ హాలీడేను ఏడాదిపాటు పెంచినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
యుద్ధ విమానాలు హెలీకాప్టర్‌లు కూడా దేశంలో తయారు చేస్తున్నామని మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పథకాలు అమలు చేయకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వం హక్కులు తీసుకోలేమని స్పష్టం చేశారు.
ప్రముఖపాత్ర: బండి
బడ్జెట్ రూపకల్పనలో అనురాగ్ ఠాకూర్ ప్రముఖ పాత్ర పోషించారని బండి సంజయ్ తెలిపారు. మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన బడ్జెట్ను తీసుకొచ్చారని సంజయ్ వివరించారు. ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా ఎందుకు మారిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
-
MoS @ianuragthakur held a meeting with Income Tax Officials in Hyderabad, Telangana.
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) February 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
| @FinMinIndia @IncomeTaxIndia | pic.twitter.com/OSz83uF7wj
">MoS @ianuragthakur held a meeting with Income Tax Officials in Hyderabad, Telangana.
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) February 6, 2021
| @FinMinIndia @IncomeTaxIndia | pic.twitter.com/OSz83uF7wjMoS @ianuragthakur held a meeting with Income Tax Officials in Hyderabad, Telangana.
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) February 6, 2021
| @FinMinIndia @IncomeTaxIndia | pic.twitter.com/OSz83uF7wj
ఇదీ చూడండి: తెలంగాణను ఎవరూ విస్మరించలేరు: అనురాగ్ ఠాకూర్