నాంపల్లిలోని బజార్ ఘాట్ ప్రాంతంలో బంగారు ముత్యాలమ్మ దేవాలయ ప్రారంభోత్సవం వేడుక కన్నుల పండుగగా నిర్వహించారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయాన్ని... ఇటీవల పునర్ నిర్మాణం చేసినట్లు ఆలయ అర్చకులు జూక్కి కృష్ణ అవధాని తెలిపారు.
ఆలయంలో హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామి... అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన, కుంభాభిషేకం చేశారు. మంగళ వాయిద్యాలు, అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: SCHOOLS OPEN: పొంచి ఉన్న కరోనా మూడో దశ ముప్పు.. విద్యాసంస్థల రీఓపెన్ అవసరమా ?