ETV Bharat / state

ENGINEERING SEATS: ఈసారి ఇంజినీరింగ్‌ సీట్లు 1.11 లక్షలు

తెలంగాణలో ఈ విద్యా సంవత్సరంలో 175 ప్రైవేట్‌ కళాశాలల్లో 1.05 లక్షల మేర ఇంజినీరింగ్ సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. కొత్తగా రెండు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలను మంజూరు చేసినట్లు తెలిపింది. ప్రైవేటు కళాశాలల్లో సీట్ల పెంపుకు ఏఐసీటీఈ ఆమోదించినా సీట్లపై తుది నిర్ణయం తీసుకునేది మాత్రం జేఎన్‌టీయూహెచ్‌.

in-this-educational-year-engineering-seats-are-1-dot-11-lakh
ఈసారి ఇంజినీరింగ్‌ సీట్లు 1.11 లక్షలు
author img

By

Published : Aug 7, 2021, 8:38 AM IST

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2021-22)లో 189 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మొత్తం 1,10,808 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. గత ఏడాది ఆ సంఖ్య 1,11,143. అంటే ఈసారి 335 తగ్గాయి. ఏఐసీటీఈ ఆమోదించిన సీట్లలో 175 ప్రైవేట్‌ కళాశాలల్లో 1,05,419 ఉన్నాయి. గత ఏడాది సీట్లు 1,04,969. అంటే ప్రైవేట్‌ కళాశాలల్లో ఈసారి కొద్దిగా పెరిగాయి.

కొత్తగా రెండు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలను మంజూరు చేసినట్లు ఏఐసీటీఈ శుక్రవారం తన వెబ్‌సైట్లో పేర్కొంది. ఈ సంస్థ సీట్లకు ఆమోదం తెలిపినా ఏ కళాశాలకు ఎన్ని సీట్లు ఇవ్వాలో తుది నిర్ణయం తీసుకునేది జేఎన్‌టీయూహెచ్‌నే. ఆయా కళాశాలల్లోని వసతులు, బోధన సిబ్బంది తదితరాంశాలను పరిశీలించి వర్సిటీ తుది అనుమతి ఇస్తుంది. అలా అనుమతించిన సీట్లకే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

తగ్గిన ప్రాంగణ నియామకాలు...

గత విద్యా సంవత్సరం(2020-21)లో రాష్ట్రంలో బీటెక్‌ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు తగ్గాయి. పోయిన సంవత్సరం 28,495 మందికి ప్లేస్‌మెంట్లు దక్కాయని ఏఐసీటీఈ పేర్కొంది. 2019-20 విద్యా సంవత్సరంలో 36,197, 2018-19లో 34,522 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారులు.. చివరికి తల్లులతో పాటే జైలుకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.