ఉద్యోగుల వేతనాల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆదివారం సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో నివేదిక ఇవ్వాలని వేతన సవరణ సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది. వాస్తవానికి 2018 జులై 1 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి రావాల్సి ఉంది. దీని కోసం 2018 మేలో రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ పీఆర్సీ కమిషన్.. గత ఏడాదిన్నరగా రాష్ట్రంలోని పరిస్థితులు, ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి అధ్యయనం చేస్తోంది. ఉద్యోగుల సర్వీస్ నిబంధనలను పరిశీలిస్తోంది.
ఇవీచూడండి: 'అయోధ్య'పై సుప్రీం చారిత్రక తీర్పు.. శ్రీరామ పట్టాభిషేకం