ETV Bharat / state

'హైదర్​నగర్​లో బస్​షెల్టర్​ను వెంటనే నిర్మించాలి' - Protest for Bus shelter in Hydernagar Hyderabad

రాష్ట్ర మంత్రి కేటీఆర్​ దత్తత తీసుకున్న హైదరాబాద్ హైదర్​నగర్​లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని తెలంగాణ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రవికుమార్ యాదవ్ ఆరోపించారు. డివిజన్​లో బస్​ షెల్టర్​ నిర్మించాలంటూ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో చేసిన ఆందోళనలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Bus_Shelter
Bus_Shelter
author img

By

Published : Feb 8, 2020, 3:44 PM IST

హైదరాబాద్​ హైదర్​నగర్​ బస్​ షెల్టర్​ను వెంటనే నిర్మించాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్​ ఉపాధ్యక్షుడు రవికుమార్​ యాదవ్​ డిమాండ్​ చేశారు. డివిజన్​లో బస్​ షెల్టర్​ నిర్మించాలంటూ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో చేసిన ఆందోళనలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైదర్​నగర్​లో జాతీయ రహదారిపై ఉన్న బస్సు షెల్టర్​ను మెట్రో పనుల కోసం నాలుగేళ్ల కిందట తొలగించారని... ఇప్పటి వరకు నిర్మించ లేదని తెలిపారు.

మంత్రి కేటీఆర్ దత్తత తీసుకొన్న డివిజన్​లో ఏమాత్రం అభివృద్ధి జరగడం లేదని... ఇక్కడే సమస్యలు కోకొల్లలుగా ఉంటే మాములు డివిజన్​ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డివిజన్​లోని అలీ తలాబ్ చెరువులో గుర్రపు డెక్క తొలగించనందున దోమల సమస్య ఎక్కువైందన్నారు. వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని... లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

బస్​షెల్టర్​ నిర్మించాలని హైదర్​నగర్​లో ఆందోళన

ఇదీ చూడండి : మేడారం జాతరకు వెళ్లొచ్చేలోపు ఇళ్లు గుల్ల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.