ఉపరితల ఆవర్తనం, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. నేడు రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు... రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ముఖాముఖి.
ఇదీ చూడండి: చెరువులను తలపిస్తున్న కాలనీలు... నీటిలోనే ప్రజలు