ETV Bharat / state

జోరువాన కురిసింది... రాజధానిలో రోడ్లను ముంచెత్తింది

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాజధానితో పాటు పలు జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపించాడు. వరద నీటితో రోడ్లు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్​ నిలిచిపోయింది. విద్యుత్​ స్తంభాలు నేలకొరిగి చీకట్లు అలుముకున్నాయి.

heavy rains across telangana till july 4
జోరువాన కురిసింది... రోడ్లను ముంచెత్తింది
author img

By

Published : Jul 3, 2020, 4:51 AM IST

Updated : Jul 3, 2020, 6:54 AM IST

హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్​, సికింద్రాబాద్‌, తార్నాకా, ఉప్పల్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, దిల్‌షుక్‌నగర్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాజ్‌భవన్‌ రోడ్డులోని లేక్‌వ్యూ అతిథి గృహం వద్ద నిలిచిన వర్షపు నీటిని జీహెచ్​ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. ఏకదాటిగా కురిసిన వర్షానికి ఆదిలాబాద్​లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

కూలిన భవనం

భారీ వర్షానికి శంషాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయం పక్కనే ఉన్న పురాతన భవనం కుప్పకూలింది. భవనం ఎదుట ఉంచిన కారు మీద శిథిలాలు పడడంతో ధ్వంసమైంది. భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

మునిగిన వంతెన... నిలిచిన ట్రాఫిక్​

ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలం సవర్గామ్ వాగు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏకధాటిగా కురుసిన వర్షానికి వంతెన పైనుంచి వరద నీరు పోటెత్తడంతో రెండు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి.

వ్యాపారుల ఇక్కట్లు

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రోడ్లపై నీరు నిలిచి పోవడం వల్ల పాదచారులు, వాహన చోదకులకు ఇక్కట్లు తప్పలేదు.

పలు చోట్ల కుంభవృష్టి

గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. అత్యధికంగా ఆదిలాబాద్​ జిల్లా నేరేడిగొండలో 6.5 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెంట్లంలో 3.7 సెంటీమీటర్ల వాన పడింది.

నేడు రేపు భారీ వర్షాలు

తెలంగాణలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ వెల్లడించింది.

ఇవీ చూడండి: మాస్కులు ధరించడం ఆరోగ్యానికి హానికరమా?

Last Updated : Jul 3, 2020, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.