హైదరాబాద్ జిల్లాలోని 16 రెవెన్యూ మండలాల్లో సుమారు 1400-1450 వరకూ వివిధ న్యాయస్థానాల్లో భూ సంబంధింత కేసులు ఉంటాయని అంచనా. హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఒక దేవాలయానికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకుని కొందరు దుకాణాలు నిర్మించారు. దీనిపై స్థానికులు కలెక్టర్‌కు వినపతిపత్రం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని ఫిర్యాదుదారులు తెలిపారు.
గతంలో ఓ తహసీల్దార్ చెరువు భూమికి ప్రైవేటు స్థలంగా ధ్రువీకరణపత్రం మంజూరు చేశారు. ఒకే భూమికి రెవెన్యూ అధికారులు వేర్వేరు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటాన్ని గుర్తించిన న్యాయస్థానం.. వాస్తవాలను గుర్తించమని కలెక్టర్‌ను ఆదేశించటంతో అసలు విషయం వెలుగుచూసింది. సమస్యను అధిగమించేందుకు కలెక్టర్ శ్వేతా మహంతి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ల్యాండ్‌బ్యాంక్ వివరాల నమోదుకు యాప్ తయారు చేసి సుమారు 1300 స్థలాల వివరాలను నమోదు చేశారు.