IIT Expects Visit Tirumala Ghat Road: తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన బండరాళ్లను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జేసీబీలు, క్రేన్లతో రాళ్లను తొలగిస్తున్నారు. కొండచరియలు పడిన ప్రాంతాన్ని దిల్లీ ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. ప్రొఫెసర్ కేఎస్ రావుతో కూడిన బృందం.. డ్రోన్ కెమెరా ద్వారా కొండచరియలు పడే 12 ప్రాంతాలను గుర్తించింది.
అధిక వర్షపాతం కారణంగానే 30, 40 టన్నుల బండరాళ్లు కొండపై నుంచి పడ్డాయని కేఎస్ రావు వెల్లడించారు. ఘాట్‌రోడ్ తిరిగి పూర్తిగా అందుబాటులోకి రావడానికి మూడు నెలలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.
ఇదీ చూడండి: Tirumala kanuma way closed : తిరుమల కనుమదారిలో విరిగిపడ్డ కొండచరియలు.. రెండో ఘాట్‌రోడ్ మూసివేత