ETV Bharat / state

డెక్కన్​మాల్​ ప్రమాదం.. ఒకరి ఆచూకీ లభ్యం.. మిగతా ఇద్దరు ఎక్కడా? - హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదాలు

Details of missing youth in Deccan Mall Incident: సికింద్రాబాద్​ మినిస్టర్​ రోడ్డులో చోటుచేసుకున్న డెక్కన్​మాల్​ అగ్ని ప్రమాదంలో దొరికిన అవశేషాలు ఆధారంగా ఒకరి ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు గల్లంతు కాగా.. దొరికిన ఎముకలు గుజరాత్​కు చెందిన జునైద్​గా తేల్చారు.

Deccan Mall Incident
Deccan Mall Incident
author img

By

Published : Mar 5, 2023, 4:12 PM IST

Details of missing youth in Deccan Mall Incident: సికింద్రాబాద్‌ నల్లగుట్ట ప్రాంతంలో డెక్కన్‌మాల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో కనిపించకుండా పోయిన ముగ్గురిలో ఒకరి వివరాలను పోలీసులు గుర్తించారు. జనవరి 20న చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో మాల్‌లో పనిచేస్తున్న గుజరాత్​కు చెందిన వసీం, అలీ చాంద్‌ జునైద్‌, జావెద్​ అనే ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు, క్లూస్‌ టీమ్‌ మూడు రోజులు గాలించి మొదటి అంతస్తు లిఫ్ట్‌ వద్ద ఎముకల అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు.

తరువాత వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. బాధితుల ముగ్గురి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను సేకరించి డీఎన్‌ఏ పరీక్షకు పంపారు. అనంతరం వాటిని సరిపోల్చగా.. లభించిన అవశేషాలు జునైద్‌గా గుర్తించారు. అక్కడే సేకరించిన మరికొన్ని అవశేషాలను మిగిలిన ఇద్దరు యువకుల కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో మరోసారి పరీక్షించనున్నారు.

ఒక్క ప్రమాదం.. మిగిల్చిన విషాదం: హైదరాబాద్​, సికింద్రాబాద్​ జంట నగరాల్లో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదాల్లో డెక్కన్​ మాల్​ ప్రమాదం ఒకటి. జనవరి 20న మధ్యాహ్నం సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన నష్టాన్ని మిగిల్చింది. ఐదు అంతస్థుల భవనంలో ప్రమాదం.. దానికి తోడు క్రీడా, కార్ల విడిభాగాలకు చెందిన షాపు కావడంతో తోలు, ప్లాస్టిక్​, నైలాన్​ సంబంధిత వస్తువులు కాలిపోవడంతో ఎంతో కాలుష్యం గాలిలో కలిసిపోయింది. నల్లని కారు మబ్బులాంటి పొగ సికింద్రాబాద్​ పట్టణాన్ని కమ్మేసింది.

ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో వచ్చి మంటలు అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఎంతకీ మంటలు, పొగ అదుపులోకి రాకపోవడంతో మరో మూడు ఫైరింజన్లు తెప్పించారు. మొత్తం ఆరు ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టినప్పటికీ గంటల తరబడిగా పరిస్థితి అదుపులోకి రాలేకపోయింది. వీరితో పాటుగా డీఆర్​ఎఫ్​, స్థానిక పోలీసులు, 108 సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆరోజు రాత్రి వరకు మాల్​లో అగ్ని కీలలు ఎగసిపడిన.. మరో రెండు రోజులు పాటు భవనం అగ్ని గుండంలా ఉంది.

ప్రమాదం అనంతరం మంత్రులు, నిపుణులు వచ్చి భవనం పరిశీలించారు. ప్రమాదం కారణంగా భవనం పూర్తిగా దెబ్బతిందని గుర్తించారు. వెంటనే కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. కూల్చివేతకు సంబంధించి రూ. 33.86 లక్షల అంచనా వ్యయంతో టెండరు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. రూ.25.94లక్షలకే పని చేస్తామని ఎస్‌.కె.మల్లు కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ముందుకు వచ్చింది. దీంతో భారీ యంత్రాల సహాయంతో ఫిబ్రవరి 5న ఐదు అంతస్థుల భవనం నేలమట్టం చేశారు.

ఇవీ చదవండి:

నేలమట్టమైన దక్కన్​మాల్ భవనం.. శిథిలాల తొలగింపు వేగవంతం

దక్కన్ మాల్ కూల్చివేత.. తప్పిన పెను ప్రమాదం

కోడలితో పారిపోయిన వ్యక్తి.. కొడుకు బైక్​పైనే జంప్.. తన భార్యకేం తెలీదంటున్న బాధితుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.