ఓఎంసీ అక్రమాల కేసులో తన పేరు తొలగించాలంటూ గగన్ విహార్ సీబీఐ కోర్టులో ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తనను ఈ కేసులో అనవసరంగా ఇరికించిందన్నారు.
ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆరో నిందితురాలిగా ఉన్నారు. గనుల లీజు మంజూరులో నిబంధనల మేరకే వ్యవహరించానని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారిగా తన విధులు నిర్వహించానని ఆమె తెలిపారు. ఈ పిటిషన్పై విచారణను సీబీఐ న్యాయస్థానం ఈనెల 25కు వాయిదా వేసింది.