ETV Bharat / state

'పిచ్చుకలను పరిరక్షించడానికి ప్రకృతి ప్రేమికులు కదం తొక్కాలి'

author img

By

Published : Mar 20, 2021, 1:59 PM IST

అంతరించిపోతున్న పక్షి జాతులను కాపాడుకోవడానికి పర్యావరణ, పక్షి ప్రేమికులంతా కదిలి రావాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సూచించారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కులో ఐ లవ్ స్పారో పేరిట జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

i love sparrow program in kbr park on the occasion of world sparrow day
కేబీఆర్ పార్కులో ఐ లవ్ స్పారో

రైతులకు మేలు చేసే పిచ్చుకలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. ప్రపంచ పిచ్చుకుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​ కేబీఆర్​ పార్కులో ఐ లవ్ స్పారో పేరిట జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పిచ్చుకలతో పాటు ఇతర పక్షులను కాపాడుకోవడానికి గిఫ్ట్ ఏ నెస్ట్ పేరిట కార్యక్రమం చేపట్టినట్లు వినయ్ భాస్కర్ తెలిపారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు గాయకుడు రాహుల్ సిప్లిగంజ్​, ఇతర ప్రముఖులకు ఈ నెస్ట్ పంపించనున్నట్లు వెల్లడించారు. అంతరించిపోతున్న పక్షులను కాపాడుకోవడానికి పర్యావరణ ప్రేమికులు ముందుకు రావాలని కోరారు.

పక్షులను రక్షించుకోవడానికి ప్రజలను చైతన్యవంతం చేసే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి శోభ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.