ETV Bharat / state

'హిమాయత్​నగర్​ డివిజన్​ను​ ఆదర్శంగా తీర్చిదిద్దుతా' - హిమాయత్​నగర్​ భాజపా అభ్యర్థి విజయం

గ్రేటర్​ ఎన్నికల్లో తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి మహాలక్ష్మి రామన్​ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. డివిజన్​ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని ఆమె అన్నారు.

i can develop himayath nagar  Division is model for develompment in ghmc
'హిమాయత్​నగర్​ డివిజన్​ ఆదర్శంగా తీర్చిదిద్దుతా'
author img

By

Published : Dec 5, 2020, 3:48 PM IST

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా హిమాయత్​నగర్ డివిజన్​ అభివృద్ధికి కృషి చేస్తానని భాజపా కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్​ గౌడ్​ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనను గెలిపించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. డ్రైనేజీ, రహదారుల సమస్యలు, యువకులకు ఉపాధి కల్పన తన ముందున్న కర్తవ్యమని ఆమె వెల్లడించారు.

'హిమాయత్​నగర్​ డివిజన్​ ఆదర్శంగా తీర్చిదిద్దుతా'

గతంలో తెరాస కార్పొరేటర్ డివిజన్​లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా సమస్యలకు నిలయంగా మార్చారని మహాలక్ష్మి విమర్శించారు. ప్రజలు తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. సమస్యలను పరిష్కరించి హిమాయత్​నగర్​ డివిజన్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై భాజపా సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.