కరోనా చికిత్సలో రోజురోజుకు కొత్తకొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండగా... ప్రాణాధార ఔషధాలు రోగులకు వైరస్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. అయినప్పటికీ రోగుల్లో ఆక్సిజన్ స్థాయి పడిపోవడం ప్రాణాంతకంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో గత 20 ఏళ్లుగా చైనా, జపాన్, అమెరికా దేశాల్లో అమలు చేస్తున్న హైడ్రోజన్ థెరపిని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మిడిలైట్ హెల్త్‌కేర్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఆక్స్ ఫర్డ్ సహా అనేక విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు సంస్థల పరిశోధనల్లోనూ హైడ్రోజన్ థెరపిలో ఇచ్చే ఆల్కలైన్ హైడ్రోజన్ వాటర్... రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెంచడమే కాకుండా దెబ్బతిన్న కణాల పునరుద్దరణకు దోహదపడుతుందని రుజువైంది. ఈ క్రమంలోనే 2016 నుంచి మిడిలైట్ హెల్త్‌కేర్ సంస్థ నగరంలోని చాలా ప్రాంతాలకు ఆల్కలైన్ హైడ్రోజన్ రిచ్ వాటర్‌ను సరఫరా చేస్తోంది. ఆస్పత్రులు, గృహా అవసరాల కోసం ప్రత్యేకంగా 20 లీటర్ల క్యాన్లలో ఆల్కలైన్ వాటర్‌ను పంపిణీ చేస్తోంది. ఈ నీటిని తాగిన ప్రజల్లో ఆక్సిజన్ స్థాయి సాధారణంగా ఉండటమే కాకుండా రోగనిరోధక శక్తి మెరుగవుతుందని మిడిలైట్ హెల్త్ కేర్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ శ్రీనివాస్ చెబుతున్నారు.
నియంత్రణలో ఉండేలా..
ఆల్కలైన్ హైడ్రోజన్ రిచ్ వాటర్... 'విటమిన్-సి' కంటే 188 రెట్లు అధిక ప్రయోజనాలను చేకూరుస్తుందని ఆక్స్ఫర్డ్ పరిశోధన పత్రాల్లో వెల్లడైంది. ఈ నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి మినరల్స్‌తోపాటు హైడ్రోజన్ గ్యాస్ విడుదలవుతుంది. ఆ నీటిని తాగడం ద్వారా రక్తంలోకి హైడ్రోజన్ త్వరగా చొచ్చుకుపోయి... కణాలకు ఆక్సిజన్ స్థాయి సరఫరాను పెంచుతుంది. తద్వారా కణాలు దెబ్బతినకుండా ఉండటం జరుగుతుంది. ప్రస్తుత కొవిడ్ సమయంలో కరోనా వైరస్ ఊపిరితిత్తులను బాగా దెబ్బతీస్తుండటం, కణజాల వ్యవస్థను క్షీణింపచేస్తుండటంతో... బాధితుడు ప్రాణాప్రాయ స్థితిలోకి వెళ్లిపోతున్నాడు. ఈ పరిస్థితిని అధిమిగించేందుకు ఆల్కలైన్ హైడ్రోజన్ వాటర్ తీసుకోవడం ద్వారా దేహంలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగి... ఊపిరితిత్తుల వాపు తగ్గడంతోపాటు కణాల క్షీణత నియంత్రణలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
మంచి ఫలితాలు చూడొచ్చు
గత 20 ఏళ్లుగా ఈ విధానంపై దేశ, విదేశాల్లో నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. రుమటైటిస్, ఆర్థరైటిస్, డయాబెటిక్, హైపర్ టైన్స్, కిడ్ని, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులపై హైడ్రోజన్ థెరపిని ప్రయోగిస్తున్నారు. జపాన్‌లో దీనిని మెడికల్ డివైజ్‌గా గుర్తించడం విశేషం. సాధారణంగా వాడుకునే నీటిలోనే హైడ్రోజన్ గ్యాస్ ఇవ్వడం ద్వారా కొవిడ్ భారిన పడే వారితోపాటు సాధారణ ప్రజల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయని వైద్యులు చెబుతున్నారు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్న కరోనా రోగులకు ఆల్కలైన్ హైడ్రోజన్ వాటర్ దొరకడం వరంగా భావించాలని మరోవైద్యురాలు డాక్టర్ సోనమ్ చెబుతోంది. గత ఐదేళ్లుగా నిత్యం ఈ నీటిని సేవిస్తోన్న సోనమ్... శారీరక ఆరోగ్యంతోపాటు వ్యక్తిగతంగా ఎంతో మార్పును చూడొచ్చని సూచిస్తోంది.
ప్రత్యేక ప్లాంట్లు
కణజాల వ్యవస్థ పునరుద్దరణతోపాటు రోగనిరోధక శక్తి పెంపులో కీలకంగా నిలుస్తున్న ఈ ఆల్కలైన్ హైడ్రోజన్ రిచ్ వాటర్‌ను మిడిలైట్ హెల్త్ కేర్... హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ లకు సరఫరా చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్న ఈ సంస్థ... దీర్ఘకాలిక వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడే ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తోంది. సామాజిక బాధ్యతగా హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రిలోనూ ఆల్కలైన్ మిషన్లను ఏర్పాటు చేసి అక్కడి వచ్చే రోగులకు హైడ్రోజన్ వాటర్‌ను అందిస్తోంది.
ఇదీ చూడండి: కరోనా గుప్పిట్లోకి పల్లెలు... అవగాహన రాహిత్యమే కారణం