Hyderabad Young Woman Gang Rape in Uttar Pradesh : ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి జాంకీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువతిని అక్కడకు పిలిపించిన మనీశ్ శర్మ అనే యువకుడు.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు జాంకీపురం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి కొద్ది రోజుల క్రితం ఉద్యోగం కోసం లక్నో వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తనకు ఉద్యోగం ఇప్పించాలంటూ హైదరాబాద్‌లోని తన స్నేహితుడిని కోరగా.. అతడు తన మిత్రుడు మనీశ్ శర్మతో ఈ విషయం చెప్పాడన్నారు. దాంతో అతడు యువతికి జాబ్ ఇప్పిస్తానని చెప్పి లక్నోకు రమ్మన్నాడని.. మనీశ్ శర్మ చెప్పినట్లుగానే యువతి ఇటీవల హైదరాబాద్ నుంచి విమానంలో లక్నో చేరుకోగా.. విమానాశ్రయంలో ఆమెను రిసీవ్ చేసుకున్నట్లు వివరించారు. నిందితుడు ఆమెను జాంకీపురంలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ హోటల్లో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు.
మరో 'నిర్భయ' ఘటన.. మైనర్‌పై గ్యాంగ్‌రేప్.. ప్రైవేట్ భాగాల్లో కర్ర చొప్పించి..
ఈ నెల 18న (బుధవారం) మనీశ్ తన ఇద్దరు స్నేహితులు తుకారాం, అభిషేక్‌లతో కలిసి యువతి ఉంటున్న హోటల్‌కు వచ్చాడని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం కాసేపు ఆమెతో మాట్లాడారని.. ఈ క్రమంలోనే ఒకరి తర్వాత ఒకరు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై సెక్షన్ 376డి కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు స్టేషన్ ఇంఛార్జ్ తెలిపారు. ఈ మేరకు యువతి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు.
తల్లీకూతుళ్లపై 8మంది గ్యాంగ్ రేప్.. ప్రైవేట్ పార్ట్‌లపై కారం చల్లి..
"యువతి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఉద్యోగం ఇప్పించాలని తన స్నేహితుడిని కోరింది. అతడు లక్నోలో ఉన్న తన మిత్రుడు మనీశ్ శర్మకు విషయం చెప్పడంతో అతడు యువతిని లక్నో రమ్మన్నాడు. అతడు చెప్పినట్లుగానే యువతి హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో లక్నోకు చేరుకోగా ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను రిసీవ్ చేసుకున్నాడు. ఆమెను జాంకీపురంలోని తన ఇంటికి దగ్గరలో ఉన్న ఓ హోటల్లో ఉంచాడు. బుధవారం తన ఇద్దరు స్నేహితులు తుకారాం, అభిషేక్‌లతో కలిసి యువతి ఉంటున్న హోటల్‌కు వెళ్లిన నిందితుడు.. ఆమెతో కాసేపు మాట్లాడాడు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 376డి కింద కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశాం. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించాం." - జాంకీపురం పోలీస్‌స్టేషన్ ఇంఛార్జీ
కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్‌రేప్.. ఆపై బయటికి తోసేసి..