ETV Bharat / state

ప్రభుత్వరంగ సంస్థల బకాయిలే రూ.200కోట్లు - Hyderabad water supply and sewage board is with Deficit budget

మహానగరానికి తాగునీరు అందించే జలమండలికి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన బిల్లు బకాయిలు పేరుకుపోయాయి. సామాన్యులకు మించి సేవలు పొందుతున్నా..పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు మాత్రం ఆ సంస్థలు ఆసక్తి చూపడంలేదు. గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ, పబ్లిక్ రంగ కార్యాలయాల బిల్లు బాకీలు వందల కోట్ల రూపాయలకు చేరాయి. సామాన్యుడు ఒక నెల బిల్లు కట్టకుంటే.. నల్లా కనెక్షన్ తీసేసి నానా తిప్పలు పెట్టే జలమండలి అధికారులు.. ప్రభుత్వ రంగ సంస్థలు కావడం వల్ల లేఖలతో సరిపెడుతున్నారు. వన్ టైం సెటిల్​మెంట్ పథకం కింద బకాయిపై వడ్డీ మాఫీ చేసినా ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం బకాయిలు కట్టేందుకు ముందుకు రావడం లేదు.

Hyderabad water  board is with Deficit budget
లోటు బడ్జెట్​తో జలమండలి
author img

By

Published : Oct 6, 2020, 5:24 PM IST

భాగ్యనగరంలోని కోటి మందికి పైగా జనాలకు హైదరాబాద్ జలమండలి తాగునీరు అందిస్తోంది. నివాస గృహాలు, అపార్ట్ మెంట్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఇలా పలు భాగాలుగా అన్ని వర్గాల వారికి తాగునీటి సౌకర్యం కల్పిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా పలు కేంద్ర, రాష్ట్ర, కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు వందల సంఖ్యలో పనిచేస్తున్నాయి. వీటికి తాగునీరు, మురుగు నీటి వ్యవస్థను చేపట్టేది హైదరాబాద్ జలమండలే. ప్రభుత్వ కార్యాలయాలకు వాణిజ్య విభాగం కింద విభజించి ప్రతినెల జలమండలి వీటికి ఛార్జీలను వేస్తోంది.

పేరుకుపోయిన పెండింగ్ బకాయిలు

నగరంలో పలు డివిజన్లలోని దాదాపు 30కు పైగా కార్యాలయాలు ఉండగా.. వీటిలో 1,787 నల్లా కనెక్షన్లతో మంచినీటిని సరఫరా చేస్తుంది. ఈ సంస్థల నుంచి ప్రతినెల రూ. 14 కోట్లు రావాల్సి ఉన్నాయి. కానీ బకాయిల వసూళ్లు మాత్రం కనీసం రూ. 5 కోట్లకు మించకపోవడంతో కొన్నేళ్లుగా భారీగా పెండింగ్ బకాయిలు పేరుకుపోయాయి.

ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ

హైదరాబాద్ జల మండలికి ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ప్రతి నెలా రూ.130 కోట్లకు పైగా ఖర్చు చేస్తుండగా.. బిల్లుల రూపంలో వచ్చేది రూ. 95 కోట్లు దాటడం లేదు. వీటిలో ప్రధానంగా రూ. 90 కోట్ల వరకు విద్యుత్‌ బిల్లులు, సిబ్బంది జీత భత్యాలు, నిర్వహణ రూపంలో ఖర్చు చేస్తుండగా.. మిగిలిన మొత్తాన్ని సర్దుబాట్లతో సరిపెడుతుంది. దీనివల్ల ఖర్చులు బారెడు, బిల్లు వసూళ్లు మూరెడుగా మారాయి.

రు. 30 కోట్లు లోటు బడ్జెట్

ప్రతినెల రూ. 30 కోట్ల లోటు బడ్జెట్‌తో జల మండలి కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు గ్రేటర్ పరిధిలో ఉన్న నల్లా కనెక్షన్లతో వచ్చే ఆదాయంలో 40 శాతం మేరకు జలమండలి లెక్కలోకి రాకపోవడం వల్ల అసలే అప్పులు, బకాయిలతో సతమతమయ్యే జలమండలికి ఇదొక అదనపు భారంగా మారింది. పాత బకాయిలు చెల్లించాలంటూ లేఖలు, నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదు.

వన్​టైమ్ సెటిల్​మెంట్ పథకం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఈ ఏడాది మార్చి వ‌ర‌కే సుమారు 1,300 కోట్ల రూపాయ‌ల‌కు పైగా బ‌కాయిలు ఉన్నట్లు స‌మాచారం. వీటిని సాధ్యమైనంత వ‌ర‌కు వెంట‌నే వ‌సూల్ చేయాల‌ని జ‌ల‌మండ‌లి వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా కేవ‌లం న‌ల్లా బ‌కాయి మాత్రమే క‌ట్టాల‌ని వ‌డ్డీ మాఫీ చేస్తున్నట్లు వెల్లడించింది. ప‌థ‌కం అమ‌లుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినా ఆశించినా ఫలితాలు మాత్రం రావడం లేదు. ఎండీ నుంచి మేనేజ‌ర్ వ‌ర‌కు అంద‌రితో క‌లిపి డాష్ బోర్డు ఏర్పాటు చేశారు. 50 మంది అధికారుల‌తో 10 ప్రత్యేక అధికారుల బృందాల‌ను ఏర్పాటు చేశారు. స‌మ‌స్యాత్మక క్యాన్​లు, అధికంగా బిల్లులు బ‌కాయి ఉన్న వినియోగ‌దారుల వ‌ద్దకు వెళ్లి మాట్లాడి బిల్లులు చెల్లించేలా స్థానిక జీఎమ్​లు, మేనేజ‌ర్లు తిరిగినా ఇప్పటికి కేవలం 90 కోట్ల రూపాయలు మాత్రమే వసూల్ అయినట్లు సమాచారం.

ఎలా రాబట్టాలి

బ‌కాయిదారుల్లో అత్యధికంగా ప్రభుత్వ కార్యాల‌యాలే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం బ‌కాయి ఉన్న ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారుల‌కు ఈ స్కీమ్ ద్వారా బిల్లులు చెల్లించి వ‌డ్డీ రాయితీ పొందాలని ఎండీ లేఖ‌లు రాసినా స్పందన లేదు. ఇప్పటికి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఈ వన్ టైమ్ సెటిల్ మెంట్ వినియోగించుకోలేదు. మిగతా బ‌కాయిదారుల్లో పాత ఇళ్లు, మూసివేసిన కార్యాల‌యాలు కూడా ఉండడం వల్ల.. వారి నుంచి బ‌కాయిలు ఎలా రాబ‌ట్టాలో అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ప్రభుత్వ సంస్థల బకాయిలు రూ.600 కోట్లు

వసూలు చేసే బిల్లులో 65 శాతం నీటి సరఫరాకు, 35శాతం సీవరేజీ సెస్ ఉండగా, అన్ని డివిజన్ల నుంచి ప్రతి నెల రూ. 102 కోట్లు వసూలు కావాల్సి ఉంది. దీనికి బిల్లుల జారీ, వసూళ్ల కోసం 12 ప్రైవేటు ఏజెన్సీలు విధులు నిర్వర్తిస్తున్నాయి. డివిజన్ల వారీగా నెలకు రూ. 90 కోట్లకు మించి వసూళ్లు జరగకపోవడం వల్ల ప్రతి నెల నిర్వహణకు ఖర్చు చేసే మొత్తంలో లోటు ఏర్పడుతుంది. వాటర్ బోర్డు సిద్ధం చేసిన వివరాల ప్రకారం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పలు ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు రూ. 600 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. డొమెస్టిక్, కమర్షియల్, బస్తీల్లోని నల్లా కనెక్షన్ల వారీగా తీసుకుంటే రూ.700 కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. వీటిలో రక్షణ శాఖ బకాయి రూ. 6 కోట్లకు పైనే ఉండగా, అత్యధికంగా పంచాయతీ రాజ్ శాఖ చెల్లించాల్సిన మొత్తం రూ. 200 కోట్లకు పైనే ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.