హైదరాబాద్‌లో డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు నడుపనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రత్యేక సర్వీసులు అన్ని మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాదు... ఆ రోజు రాత్రి మద్యం సేవించిన వారికీ మెట్రోలో అనుమతి ఇస్తున్నామన్నారు. అయితే... మద్యం సేవించిన వారు మాత్రం... తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని ఎన్వీఎస్రెడ్డి సూచించారు.
ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు