ETV Bharat / state

ఈ బండి.. కదిలేదెట్లా? నరకప్రాయంగా రహదారులు

author img

By

Published : Aug 18, 2020, 6:16 AM IST

వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా హైదరాబాద్‌ నగరంలో రహదారుల పరిస్థితి మెరుగుపడటం లేదు. ప్రజాధనం ఆవిరవుతున్నా రోడ్ల కష్టాలు తీరడం లేదు. వర్షాలతో సమస్య మరింత తీవ్రమైంది. పైవంతెనలు, అండర్‌పాస్‌లు, కొత్త రోడ్ల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. ఆయా చోట్ల అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల నిర్మాణం చేపట్టలేదు. నగరవ్యాప్తంగా ఇదే దుస్థితి కనిపిస్తోంది. ఆ గుంతల్లోనే ప్రయాణిస్తూ వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు.

hyderabad roads
hyderabad roads

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రస్తుతం రూ.2,500 కోట్ల విలువైన ఎస్సార్డీపీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పిల్లర్ల కోసం గుంతలు తవ్వడం, వాటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయడం వరకు బాగానే ఉన్నా.. ఇరువైపులా వాహనదారుల కోసం అందుబాటులోకి తెచ్చిన అదనపు రోడ్డు మార్గాన్ని పట్టించుకోవడం లేదు. నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. వాన ధాటికి ఆ ప్రాంతం గుంతలమయం అవుతోంది. బహదూర్‌పుర కూడలిలో నిర్మిస్తున్న పైవంతెన నిర్మాణ పనులు అందుకు నిదర్శనం. విస్తరించిన రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేయకుండా నిర్మాణ పనులు చేస్తుండటంతో.. ఆ ప్రాంతమంతా భారీ వాహనాల రాకపోకలతో ఛిద్రమైంది.

కష్టాలు తప్పడం లేదు

నాగోల్‌ కూడలి, ఎల్బీనగర్‌ కూడలి, మిథాని కూడలి, ఒవైసీ ఆస్పత్రి కూడలి, జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.45 ఎక్స్‌ప్రెస్‌వే పనులు దగ్గరా అదే దుస్థితి కనిస్తోంది. ప్రత్యామ్నాయ రోడ్ల అభివృద్ధికి భూసేకరణ జరుగుతున్న ప్రాంతాల్లో కాలనీ రోడ్లు గుంతలమయంగా మారాయి. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్‌ రహదారుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌) చేపట్టిన వంతెనలు, రహదారుల నిర్మాణాల దగ్గరా వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు.

ప్రైవేటు రోడ్ల నిర్వహణా అంతే..

భారీ నిర్వహణ వ్యయంతో ఐదేళ్లపాటు నగరంలోని 790 కి.మీ ప్రధాన రహదారులను అధికారులు ప్రైవేటు ఏజెన్సీల నిర్వహణకు ఇచ్చారు. బడా ఏజెన్సీలు పనులు నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ రోడ్లు ప్రమాదకరంగానే కనిపిస్తున్నాయి. కవాడిగూడ రోడ్డు, మోండా మార్కెట్‌ రోడ్డు, ఇతరత్రా నిర్మాణ పనులు అందుకు ఉదాహరణ. మోండా మార్కెట్‌ దగ్గర జరుగుతున్న సీసీ రోడ్డు పనులు గత కొన్ని రోజులుగా నిలిచిపోయాయి. వర్షం అందుకు తోడవడంతో ఆ ప్రాంతంలో నాలాలు, మురుగు నీటి మ్యాన్‌హోళ్లు ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి.

జూపార్కు చెంత.. అడుగులోతు గుంత: బహదూర్‌పురలో నెహ్రూ జూపార్కు ముందు కోసుకు పోయిన రహదారి. వాహనాల బంపర్లు దెబ్బతింటున్నాయి.

ప్రభుత్వం పట్టించుకోక.. పోలీసులు చూస్తూ ఉండలేక..: సికింద్రాబాద్‌ - కంటోన్మెంట్‌ ప్రధాన రహదారి గుంతలు తేలడంతో ప్రమాదాలు జరక్కుండా ట్రాఫిక్‌ పోలీసుల చొరవ

  • హైదరాబాద్‌ నగర రహదారుల పొడవు.. 9,100కి.మీ
  • అందులో కాలనీ రోడ్ల పొడవు.. 7వేల కి.మీ
  • అందులో ప్రైవేటు నిర్వహణకు ఇచ్చిన రోడ్లు.. 790కి.మీ
  • అభివృద్ధి పనులు జరుగుతున్న కూడళ్లు.. 6

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.