Hyderabad Rains Today : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో.. సాయంత్రం వేళ భారీ వర్షం కురిసింది. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకపూల్, ఖైరతాబాద్, కూకట్పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్, కేపీహెచ్‌బీ కాలనీ, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, సనత్‌నగర్, ఎస్ఆర్ నగర్, మైత్రివనం, అమీర్‌పేట్, మధురనగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ట్యాంక్ బండ్, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, సైదాబాద్‌లో వర్షం కురిసింది.
Himayath sagar gates are lifted : హిమాయత్‌నగర్ ఆరు గేట్లు ఎత్తివేత.. సర్వీస్ రోడుపైకి వరద నీరు
Telangana Rains : భారీగా కురిసిన వర్షంతో.. రహదారులన్నీ జలమయమయ్యాయి. నగరవాసులు తడిసి ముద్దయ్యారు. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చింతలకుంట వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరదనీరు చేరింది. దీంతో ట్రాపిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం మరో గంట పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జంట నగరాలలో కురుస్తున్న వర్షానికి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అప్రమత్తం అయ్యారు.
నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు. సమస్యల పరిష్కారం కోసం.. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది హెల్ప్‌లైన్ నంబర్ 040-21111111, 9000113667 కంట్రోల్ రూమ్‌కు డయల్ చేయాలని మేయర్ సూచించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, ఈవీడీఎం బృందాలు.. ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
నిండుకుండలా హుస్సేన్ సాగర్.. జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద
Telangana Weather Report Today : రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం( IMD ) ప్రకటించింది. సోమవారం, మంగళవారం కొన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది.
Today Weather Report in Telangana : రాష్ట్రంలోని పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం వాయువ్యానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 12న ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. మరోవైపు శనివారం భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షానికి.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. పని ముగించుకుని వస్తున్న కార్మికులు తడిసి ముద్దయ్యారు. నగరంలో వర్షం కురిసిన పలు ప్రాంతాలు వరద నీటితో జలమయమయ్యాయి.
Heavy Flow in Musi River : ఉద్ధృతంగా మూసీ.. జియాగూడ రహదారిపై రాకపోకలు నిలిపివేత