Traffic Police Violating Rules : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చట్టాలు తీసుకొచ్చారు. కొద్దిరోజుల వరకు చలాన్లు విధిస్తూ.. కేసులు పెడుతూ.. వాహనదారుల్లో భయం పుట్టించారు. ఈ చట్టాలు ఇలాగే అమలైతే.. తెలంగాణలో ఇక రోడ్లపై నెత్తురు ప్రవహించదని అందరు గట్టిగా నమ్మారు. కానీ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం ఆ టార్గెట్‌ని చేరనీయడం లేదు. ముఖ్యంగా నిబంధనలు సాధారణ ప్రజలకే.. తమకు కాదన్నట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
రహదారులపై రాంగ్‌రూట్లో వెళ్లే వాహనదారులకు రూ.1,100 చలానా విధిస్తున్న పోలీసులు తమ వాహనాలు మాత్రం ఎలా వెళ్లినా కన్నెత్తి చూడరు. గురువారం ఉదయం సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం ఎదురుగా ఓ పోలీసు వాహనం రాంగ్‌రూట్లో వెళుతుండటమే అందుకు నిదర్శనం. మరోవైపు.. ఓ ద్విచక్రవాహనదారుడు తాజ్‌డెక్కన్ కూడలిలో సిగ్నల్ మీరి వెళుతుండగా ట్రాఫిక్ సిబ్బంది ముచ్చట్లలో మునిగి కనిపించారు.
ఇదీ చూడండి..
'మేధోమధన సదస్సు సక్సెస్.. 6 నెలల ముందే అభ్యర్థుల ప్రకటన..'
'ఏ ఒక్కరి కోసమో న్యాయవ్యవస్థ పనిచేయదు.. పరిధులు దాటి మాట్లాడితే చర్యలు తప్పవు