ETV Bharat / state

హైదరాబాద్​లో 23 లక్షల నగదు స్వాధీనం.. ఒకరి అరెస్టు - నగదు స్వాధీనం

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. భారీ స్థాయిలో నగదు పట్టుబడుతూనే ఉంది. నిజాంపేట్​లో జరిగిన వాహన తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి సరైన పత్రాలు లేని రూ. 23 లక్షలు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.

నగదు స్వాధీనం
author img

By

Published : Apr 8, 2019, 4:37 PM IST

ఎన్నికల వేళ ఓటర్లకు పంపిణీ చేసేందుకు డబ్బు తరలిస్తున్న ఓ వ్యక్తిని కె.పి.హెచ్.బి. పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.23 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న నిజాంపేట రోడ్డులో వాహన తనిఖీలు చేస్తుండగా... అటుగా వచ్చిన రిట్జ్​ కారును ఆపి తనిఖీ చేయగా సొమ్ము బయట పడిందని కూకట్​పల్లి ఏసీపీ సురేందర్​రావు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని అన్నారు. పట్టుబడిన ధనం కాంగ్రెస్​ అభ్యర్థికి చెందినదిగా నిందితుడు తెలిపారని పేర్కొన్నారు.
పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

23 లక్షల నగదు స్వాధీనం

ఇదీ చదవండి : 'ఎన్నికలైపోయాక 24 గంటల కరెంటు కూడా రాదు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.