హైదరాబాద్ నగర ట్రాఫిక్ (Hyderabad Traffic Police) పోలీసులు మరోసారి మానవ అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్ (Green Channel) ఏర్పాటు చేశారు. గుండె, ఊపిరితిత్తుల తరలించడానికి రాచకొండ పోలీసులతో సమన్వయం చేసుకుని ఈ సౌకర్యం కల్పించారు. ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆసుపత్రి నుంచి గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించేందుకు ట్రాఫిక్‌ను నిలిపివేశారు.
అంబులెన్స్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా చూశారు. ఎల్బీనగర్ నుంచి జూబ్లీహిల్స్‌కు 30 కిలోమీటర్ల దూరాన్ని అంబులెన్స్ కేవలం 27 నిమిషాల్లో చేరుకోగలిగింది. ఉదయం 9.18 గంటలకు బయలుదేరిన వాహనం 9.45 గంటలకు అపోలో ఆసుపత్రికి చేరుకుంది. కామినేని ఆసుపత్రి నుంచి మరో అంబులెన్స్‌లో ఊపిరితిత్తులను బేగంపేట కిమ్స్‌కు తరలించారు. ఈ వాహనం ఉదయం 9.36 గంటలకు ఎల్బీనగర్ నుంచి బయలుదేరి బేగంపేట కిమ్స్‌కు 9.54 గంటలకు చేరుకుంది.
అంబులెన్స్‌లు వేగంగా వెళ్లేందుకు వీలుగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులను వైద్యులు అభినందించారు. ఈ సంవత్సరం ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు 17 సార్లు అవయవాల తరలింపు కోసం గ్రీన్ ఛానల్ సౌకర్యం కల్పించారు.
ఇదీ చదవండి: KTR: ఈటలకు తెరాసలో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలి: కేటీఆర్