హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గస్తీ వాహనాల పనితీరు మరింత మెరుగుపర్చి.... నగరవాసులకు అందుబాటులోకి తెస్తామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నూతన సంవత్సరంలో హైదరాబాద్కు గస్తీ వాహనాలు బ్రాండ్ అంబాసిడర్గా మారతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనే వారు... అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.... అంజనీ కుమార్ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రయత్నించవద్దని సూచించారు. నిబంధనలు పాటించకుంటే కేసులు తప్పవని హెచ్చరించారు.
ఇవీ చూడండి: వంద శాతం అక్షరాస్యతే ధ్యేయం: కేసీఆర్