ETV Bharat / state

కైట్ ఫెస్టివల్: పరేడ్ మైదానంలో పతంగులోత్సవం

హైదరాబాద్​ నగరంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. రంగురంగుల గాలిపటాలతో సికింద్రాబాద్​ పరేడ్​ మైదానం సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున మైదానానికి చేరుకుని గాలి పటాలు ఎగరవేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడిపారు.

hyderabad-people-hoisted-kites-in-secunderabad-parade-ground
కైట్ ఫెస్టివల్: పరేడ్ మైదానంలో పతంగులోత్సవం
author img

By

Published : Jan 14, 2021, 8:18 PM IST

పతంగుల పండుగ.. నయనానందకరంగా సికింద్రాబాద్​ పరేడ్ మైదానం

రంగురంగుల గాలిపటాలతో సికింద్రాబాద్ పరేడ్ మైదానం వర్ణ రంజితంగా మారింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు మైదానానికి చేరుకొని గాలిపటాలు ఎగరవేశారు. కొవిడ్ కారణంగా చాలా రోజులు ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. సంక్రాంతి వేడుకల దృష్ట్యా బయటకు వచ్చి పరేడ్ మైదానంలో ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపారు. ఇంటిల్లిపాది తరలివచ్చి పిల్లాపాపలతో పతంగులు ఎగరవేస్తూ ఆనందించారు.

గతేడాది పతంగోత్సవం, మిఠాయిల ఉత్సవాలను నిర్వహించిన ప్రభుత్వం... కొవిడ్​- 19 కారణంగా వాటిని రద్దు చేసింది. కానీ ఏ మాత్రం నిరాశ చెందని నగరవాసులు... పెద్ద సంఖ్యలో మైదానానికి చేరుకొని గాలిపటాలు ఎగరవేస్తూ సంతోషంగా గడిపారు. చాలా కాలం తర్వాత ఇలా బయటకు వచ్చి ఆనందంగా గడపటంతో యువతీయువకులు, చిన్నపిల్లలు హర్షం వ్యక్తం చేశారు. పలువురు తల్లిదండ్రులు.. తమ పిల్లలకు పతంగులు ఎగరవేయడం నేర్పిస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం కైట్ ఫెస్టివల్​ను ఘనంగా నిర్వహించాలని కోరారు.

ఇదీ చదవండి: అంబరాన్నంటిన సంబురాలు... కిటకిటలాడిన ఆలయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.