హైదరాబాద్‌లో వరదసాయం అందలేదంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. లంగర్‌హౌజ్‌కు చెందిన ప్రశాంత్‌నగర్ రెండో ఫేజ్ వాసులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. వారం గడుస్తున్నా ఇంతవరకు ఒక్కరూపాయి సాయం అందలేదని వాపోయారు.
అధికారులు, నాయకులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, వారికి అనుకూలమైన వారికే ఆర్థికసాయం అందిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.