ETV Bharat / state

కరోనా కట్టడికి 62 వ్యాక్సిన్లపై అధ్యయనం - కొవిడ్​ వైరస్​ వార్తలు

కొవిడ్​ వైరస్​ కట్టడికి 62 వ్యాక్సిన్లపై అధ్యయనాలు జరుగుతుండగా.. రెండు మాత్రం క్లినికల్​ ట్రయిల్స్​లో ఉన్నాయని నిమ్స్​ ప్రొఫెసర్​ స్వరూప రెడ్డి తెలిపారు. నిర్వహిస్తున్న ప్రయోగాల్లో మూడు స్థాయిల్లో విజయవంతమైతేనే వ్యాక్సిన్లు అంటుబాటులోకి వస్తాయన్నారు. ఎన్​-95 మాస్కులకు బదులు గుడ్డతో చేసిన మాస్కులు కూడా ధరించవచ్చని ఆమె స్పష్టం చేశారు. మధుమేహం వ్యాధిగ్రస్తులు ఒంట్లో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని అపొలో ఆస్పత్రి వైద్య నిపుణుడు నాగరాజు పేర్కొన్నారు.

కరోనా కట్టడికి 62 వ్యాక్సిన్లపై అధ్యయనం
కరోనా కట్టడికి 62 వ్యాక్సిన్లపై అధ్యయనం
author img

By

Published : Apr 24, 2020, 8:14 PM IST

Updated : Apr 24, 2020, 8:28 PM IST

కరోనా వైరస్‌ కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా 62 వ్యాక్సిన్లపై అధ్యయనాలు జరుగుతున్నాయని.. అందులో రెండు మాత్రం క్లినికల్‌ ట్రయిల్స్‌లో ఉన్నట్లు నిమ్స్‌ ప్రొఫెసర్‌ స్వరూప రెడ్డి వెల్లడించారు. అందులో ఒకటి అమెరికా... మరొకటి చైనాకు చెందినవని ఆమె స్పష్టం చేశారు. నిర్వహిస్తున్న ప్రయోగాల్లో మూడు స్థాయిల్లో విజయవంతమైతేనే.. వ్యాక్సిన్‌ వాడకంలోకి వస్తుందని ఆమె వివరించారు. కోవిడ్‌-19పై చైతన్యం తీసుకొచ్చేందుకు సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నిమ్స్‌ వైద్యనిఫుణులు స్వరూప రెడ్డి, అపోలో వైద్య నిపుణులు నాగరాజు కొవిడ్​ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.

"ఎన్‌-95 రకం మాస్క్‌లు కొరత ఉన్నందున... అందరూ వాటిని వాడాల్సిన పనిలేదు. కోవిడ్‌ రోగులకు వైద్యం చేసేవాళ్లకు దగ్గరగా ఉండేవాళ్లు వాడితే సరిపోతుంది. మిగిలిన వాళ్లు గుడ్డ మాస్క్‌లుకానీ, సర్జికల్‌ మాస్క్‌లుకానీ వాడితే సరిపోతుంది. బయటకు తిరగాల్సిన అవసరం ఉన్న వారు ఇతరులను తాకకుండా భౌతిక దూరం పాటించి.. సబ్బు, శానిటైజేషన్‌తో తరచూ చేతులను శుభ్రపరుకుంటూ ఉండాలి. పాలు, కూరగాయలు లాంటివి తీసుకున్నప్పుడు.. వాటిని శుభ్రంగా కడుగి వాడుకోవాలి. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్‌ ఔషదాలను వైద్యుల సలహా లేకుండా వాడరాదు. "

-స్వరూప రెడ్డి, నిమ్స్‌ వైద్య నిఫుణులు

కరోనా కట్టడికి 62 వ్యాక్సిన్లపై అధ్యయనం

"కరోనా మహమ్మారి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, రోగనిరోధక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు అవసరమైన వ్యాయామం చేయాలి. మధుమేహం ఉన్నవారు చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. మానసికంగా ఆందోళన చెందేవారు వైద్యులను ఫోన్​ ద్వారా సంప్రదించి సమస్యలను నివృత్తి చేసుకోవచ్చు. ఉష్ట్రోగ్రతలు తక్కువ ఉండి, గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నట్లయితే.. కొవిడ్​ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ.

-నాగరాజు, అపొలో ఆస్పత్రి వైద్యనిఫుణులు

కరోనా కట్టడికి 62 వ్యాక్సిన్లపై అధ్యయనం

ఇదీ చదవండి: ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా

Last Updated : Apr 24, 2020, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.