Old city riots in Hyderabad: ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేయటం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీంతో భాజపా అధిష్ఠానం ఆయనపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. పోలీసులు రాజాసింగ్‌ను అరెస్టు చేయగా సాయంత్రమే నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వటంతో ఆయన బయటికి వచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చింది. దీంతో పోలీసులు రాజాసింగ్‌పై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.
రాజాసింగ్‌పై పీడీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బేగంబజాల్, ఎంజే మార్కెట్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బేగంబజార్ వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేసి నిరసన తెలిపారు. ఈ రోజు సైతం నిరసనలు కొనసాగే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా పాతబస్తీలో గత మూడు రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న రాజాసింగ్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిరసనలు చేపట్టారు.
ప్రశాంతంగా ముగిసిన నమాజ్‌లు..: ఈ క్రమంలోనే శుక్రవారం ప్రార్థనలు దృష్టిలో ఉంచుకొని చార్మినార్, మక్కా మసీద్ పరిసరాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. చార్మినార్‌లో నిరసనలు జరిగే అవకాశం ఉండటంతో మక్కా మసీదు పరిసరాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. గస్తీ వాహనాలతో పహారా కాస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చార్మినార్ నాలుగు దిక్కులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. శాలిబండ, మొగల్పురా, హుస్సేనీ ఆలం, భవానీ నగర్, షాహీన్ నగర్, డబీర్పురాతో పాటు పలు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. సునిశిత ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఎట్టకేలకు అన్నిచోట్లా నమాజ్‌లు ప్రశాంతంగా ముగియటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
నిరసనలు ఆపేయాలని అసదుద్దీన్ పిలుపు..: మరోవైపు రాజాసింగ్ పట్ల పోలీసులు చట్టపరంగా ముందుకెళ్తున్నారని.. నిరసనలు ఆపేయాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. పలు ముస్లిం మతపెద్దలు సైతం యువకులకు సూచనలు చేస్తున్నారు.
సంబంధిత కథనాలు..:
- రాజాసింగ్ మద్దతుదారుల ఆందోళనలు, వ్యాపారుల దుకాణాలు బంద్
- రాజాసింగ్‌కు పోలీసుల నోటీసులు, పాతవి తవ్వుతున్నారన్న ఎమ్మెల్యే
- రాజకీయ పార్టీల ఉచితాలపై త్రిసభ్య ధర్మాసనం, ఆ తీర్పు పునఃపరిశీలనకు సుప్రీం ఓకే
- పాతబస్తీలో భారీ భద్రత, ముస్లింల ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో పటిష్ఠ నిఘా
ఇవీ చూడండి..
ఈ చిన్నారుల డ్యాన్స్‌కు కేటీఆర్ ఫిదా, నిజంగానే కేక పెట్టించారుగా
భార్యపై ప్రేమతో ఇంట్లోనే మృతదేహాన్ని పూడ్చిన భర్త, కానీ చివరకు