హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గోల్కొండ పోలీస్‌ఠాణాల పరిధుల్లో పనులు చేస్తున్న వివిధ రాష్ట్రాల వలస కార్మికుల్లో వెయ్యిమందికిపైగా పిల్లాపాపలతో కలిసి నడుచుకుంటూ స్వస్థలాలకు బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకుని వారుంటున్న ప్రాంతాలకు పంపించారు.
ఆదేశాలు రాగానే పంపుతాం..
సుదీర్ఘ లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వలసకూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ పనిలేక.. సొంతూళ్లకు వెళ్లలేక.. తినేందుకు తిండి లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. వీరి ఇబ్బందులు గమనించిన పోలీసులు.. ప్రభుత్వ నిర్ణయం మేరకు వారిని స్వస్థలాలకు పంపుతామని చెబుతున్నారు. ఆదేశాలు రాగానే అనుమతిస్తామని పేర్కొంటున్నారు. కూలీలు తాము నడుచుకుంటూనైనా వెళ్తామని చెబుతున్నారు.
లాక్‌డౌన్ కారణంగా గత నెలన్నరగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మధ్యప్రదేశ్‌కు చెందిన జియాన్ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది తినేందుకు తిండిలేక, చేసేందుకు పనిలేక పస్తులు ఉంటున్నామని పేర్కొంది.