ETV Bharat / state

Hyderabad Metro Service: ఆ స్టేషన్లలో మెట్రో సేవలు నిలిపివేత

Hyderabad Metro Service: ఇవాళ సాయంత్రం ఎంజీబీఎస్‌- జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండవని వెల్లడించారు.

Hyderabad Metro Service
Hyderabad MetHHyderabad Metro Serviceyderabad Metro Servicero Service
author img

By

Published : Jul 3, 2022, 11:58 AM IST

Updated : Jul 3, 2022, 12:26 PM IST

Hyderabad Metro Service: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నేడు భాజపా విజయ సంకల్ప సభ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతోపాటు పార్టీ ప్రముఖులు ఈ సభకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో మ.2 గంటల నుంచి రాత్రి 10 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను పోలీసులు విధించారు.

మరోవైపు పరేడ్‌ గ్రౌండ్స్‌ సమీపంలో ఉన్న ప్యారడైజ్‌, పరేడ్‌గ్రౌండ్స్‌, జేబీఎస్‌ మెట్రో స్టేషన్లలో సేవలను సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 గంటల వరకు నిలిపివేశారు. ఈ సమయంలో మెట్రో రైళ్లు ఆ స్టేషన్‌లలో ఆగవు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి కోరారు. మిగతా స్టేషన్లలో సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 3, 2022, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.