New Metro Routes in Hyderabad : భవిష్యత్ లో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలు నిర్మాణం చేపడతామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్ మెట్రోను నాలుగు కారిడార్లుగా విభజించామన్నారు. ఓఆర్ఆర్ శంషాబాద్ జంక్షన్- తుక్కుగూడ జంక్షన్-బొంగులూరు జంక్షన్ - పెద్ద అంబర్ పేట్ జంక్షన్ వరకు 40 కిలోమీటర్లలో 5 స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ఈ కారిడార్ నిర్మాణానికి రూ.5,600 కోట్లు, ఓఆర్ఆర్ పెద్ద అంబర్ పేట జంక్షన్-ఘట్ కేసర్ జంక్షన్-షామీర్ పేట్ జంక్షన్-మేడ్చల్ జంక్షన్ వరకు 45 కిలోమీటర్లలలో 5 స్టేషన్లు వస్తాయని ఈ కారిడార్ నిర్మాణానికి రూ.6,750 కోట్లు, ఓఆర్ఆర్ మేడ్చల్ జంక్షన్-దుండిగల్ జంక్షన్-పటాన్ చెరు జంక్షన్ వరకు 29కిలోమీటర్లలో 3 స్టేషన్లు వస్తాయని ఈ కారిడార్ నిర్మాణానికి రూ.4,785 కోట్లు, ఓఆర్ఆర్ పటాన్ చెరు జంక్షన్- కోకాపేట జంక్షన్ -నార్సింగి జంక్షన్ వరకు 22 కిలోమీటర్లలలో 3 స్టేషన్లు ఉంటాయని ఈ కారిడార్ నిర్మాణానికి రూ.3,675 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు.
Hyderabad Metro new corridors : మొత్తం ఈ నాలుగు కారిడార్లను 136 కిలోమీటర్లలో ఏర్పాటు చేస్తామని 16 స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని, వీటి నిర్మాణానికి సుమారు రూ.20,810 కోట్లు అవసరం అవుతాయన్నారు. విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్ నానక్ రామ్ గూడ- శంషాబాద్ వరకు 20 కిలోమీటర్లు, గచ్చిబౌలి- నానక్ రామ్ గూడ జంక్షన్ వరకు వరకు మరో 2 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు.
ప్రస్తుతం నగరంలో కోటికిపైగా జనాభా నివసిస్తున్నారని.. మరో కోటి జనాభాకు సరిపోయేలా మెట్రోను విస్తరించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసీఆర్ సూచించారని ఆయన పేర్కొన్నారు. రసూల్ పూరలోని మెట్రో కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భవిష్యత్‌లో మెట్రో రైలు విస్తరణ అంశాలకు సంబంధించిన అంశాలను వివరించారు.
ట్రాఫిక్ సమస్యే ఉండదు: పటాన్ చెరు నుంచి నార్సింగ్ వరకు 22 కిలోమీటర్లు, తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కిలోమీటర్లు, ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట్ వరకు, మేడ్చల్ జంక్షన్ నుంచి పటాన్ చెర్వు వరకు 29 కిలోమీటర్లు, పటాన్ చెర్వు నుంచి నార్సింగ్ వరకు 22కిలోమీటర్లు, శంషాబాద్ నుంచి షాద్ నగర్, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు 25కిలోమీటర్లు మెట్రో కారిడార్ నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రూపొందించామన్నారు. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు, జేబీఎస్ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ పైవంతెన, మెట్రో రైలు నిర్మాణం ఏర్పాటు చేయనున్నారని మెట్రో ఎండీ వెల్లడించారు.
Hyderabad Metro Phase 2 : హైదరాబాద్ నలువైపులా మెట్రో.. రూ.69 వేల కోట్లతో 278 కి.మీ. మేర నిర్మాణం
ఎక్కడ నుంచి | ఎక్కడి వరకు | దూరం(కిలోమీటర్లలో) |
శంషాబాద్ | పెద్దఅంబర్‌పేట | 40 |
పెద్దఅంబర్‌పేట | మేడ్చల్ | 45 |
మేడ్చల్ | పటాన్‌చెరు | 29 |
పటాన్‌చెరు | నార్సింగి | 22 |
ఎల్బీ నగర్ | పెద్దఅంబర్‌పేట | 13 |
శంషాబాద్ | షాద్‌నగర్ | 26 |
తార్నాక | ఈసీఐఎల్ | 8 |
జేబీఎస్ | తూంకుంట | 17 |
ప్యాట్నీ | కండ్లకోయ | 12 |
జేబీఎస్-తూంకుంట, ప్యాట్నీ నుంచి కండ్లకోయ మార్గాల్లో డబుల్ డెక్కర్ మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. పైన తెలిపిన మార్గాల్లో మెట్రో వస్తే హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు ఉండవని ఆశాభావం వ్యక్తం చేశారు. రవాణా మరింత సులభం కానున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మెట్రోలో రోజుకి లక్షల సంఖ్యలో ప్రయాణిస్తున్నారని.. అనుకున్న లక్ష్యాలను చాలా వరకు పూర్తి చేసిందని తెలిపారు. మెట్రో వల్ల రాష్ట్ర అభివృద్ధి మరింతగా వేగం పుంజుకోనున్నదని వెల్లడించారు.
'హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆయా మార్గాల్లో రూ.69 వేల కోట్లు పెట్టి మెట్రో విస్తరణ పనులు చేయనున్నాం. భవిష్యత్తులో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో వచ్చేలా 136 కిలో మీటర్లు మేర కారిడార్ నిర్మించనున్నాం. కోటి జనాభాకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.' - ఎన్వీఎస్‌రెడ్డి, మెట్రో రైల్ ఎండీ
ఇవీ చదవండి :