ఉత్తర ఝార్ఖండ్ నుంచి దక్షిణ కోస్తా కర్ణాటక వరకు, ఛత్తీస్‌గఢ్ విదర్భ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఈ రెండు రోజులపాటు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల,కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్‌నగర్, వికారాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు అక్కడక్కడ 40 నుంచి 42 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.