ETV Bharat / state

భాగ్యనగరంలో అడుగడుగునా పోలీసుల నిఘా నీడ - investigation with cc cameras

ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలకు నిలయం. దేశం నలుమూలల నుంచి వచ్చే వారిని అక్కున చేర్చుకునే ప్రాంతం. ఇలాంటి పరిస్థితుల్లో నేరాల అదుపు, శాంతిభద్రతల పరిరక్షణ కత్తిమీద సాములాగే ఉంటుంది. ఇందుకోసం అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పోలీస్ వ్యవస్థ.... ప్రతీ అంగుళాన్ని డేగకన్నుతో పరిశీలిస్తోంది. నిఘా వ్యవస్థను పటిష్ఠం చేస్తూ... విశ్వనగర నిర్మాణంలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది.

hyderabad-is-the-first-city-in-the-country-with-high-cctv-cameras
భాగ్యనగరంలో అడుగడుగునా పోలీసుల నిఘా నీడ
author img

By

Published : Aug 2, 2020, 5:03 AM IST

భాగ్యనగరంలో అడుగడుగునా పోలీసుల నిఘా నీడ

హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతోంది. కోటికి పైగా జనాభాతో... విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం వచ్చే వారితో ప్రపంచ మహానగరాలతో పోటీ పడుతోంది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చే వారిని భాగ్యనగరం అక్కున చేర్చుకుంటోంది. ఈ పరిస్థితుల్లో నగరంలో నేరాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. అంతరాష్ట్ర నేరగాళ్ల ఆకృత్యాలు, చోరీలు, దోపిడీలు, హత్యలు, హత్యాచారాలు ఇలా పలుతరహా నేరాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న క్రైంకు తోడు... నేరం నుంచి బయటపడేందుకు నేరస్థుల చాకచక్యం ఎంతో పెరుగుతోంది. వీటిని సవాల్​గా తీసుకున్న పోలీసులు నేరాలను నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగా మొదటగా సీసీ కెమెరాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎక్కడ నేరం జరిగినా పోలీసులు మొదట ఎంచుకునేది సీసీ కెమెరాలనే అంటే... వాటికి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతోంది.

దేశంలో మొదటి స్థానం

లండన్‌కు చెందిన ఓ సంస్థ ఇటీవల విడుదల చేసిన సీసీ కెమెరాలు గల నగరాల జాబితాలో హైదరాబాద్‌ 16వ స్థానాన్ని దక్కించుకోగా.... దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. గత ఆరేళ్లుగా వీటి ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ వచ్చిన పోలీసులు... వాణిజ్య సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్టుమెంట్లలో నివాసం ఉండే వాళ్లతో చర్చించి నిఘా నేత్రాల సంఖ్యను గణనీయంగా పెంచారు. పలు పారిశ్రామిక, ఐటీ సంస్థలు సైతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీలో భాగంగా సీసీ కెమెరాలు పలుచోట్ల బిగించారు. ఇలా హైదరాబాద్‌లో దాదాపు 3లక్షల 30వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

సీసీ కెమెరాలతో దర్యాప్తు సులభం

సీసీ కెమెరాలతో పోలీసుల దర్యాప్తు ఎంతో సులభం అవుతోంది. నేరం చేసిన వ్యక్తి పారిపోయే సమయంలో కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు లభ్యం అవుతున్నాయి. వీటితో నేరస్థుడికి పాతనేరాలతో సంబంధం ఉందా.... అతనెవరూ అనేది సులభంగా గుర్తించగలుగుతున్నారు. అంతేకాకుండా నేరస్థులు ఉపయోగించే వాహనాల ఆధారంగానూ దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. గొలుసు దొంగలు, ఇళ్లల్లో చోరీలు, వాహనాలు ఎత్తుకెళ్లడం, హత్యలు, హత్యాయత్నం, అపహరణ, తప్పిపోవడం లాంటి కేసుల్లో పోలీసులు మొదట సీసీ కెమెరాల దృశ్యాలనే పరిశీలిస్తున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండే సీసీ కెమెరాలను... సంబంధిత స్టేషన్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. ఆ ప్రాంతంలో ఏదైనా ఘటన జరిగిన వెంటనే ఆ అక్కడ రికార్డైన దృశ్యాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే నేరాల్లో దాదాపు 80 శాతం సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు జరుగుతున్నాయంటే .... ఇవి ఎంత ఉపయోగపడుతున్నాయేది అర్థం చేసుకోవచ్చు.

ఏర్పాటు వేగవంతం

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనూ సీసీ కెమెరాల ఏర్పాటు వేగవంతంగా జరుగుతోంది. సైబరాబాద్​లో దాదాపు లక్షా 20వేల కెమెరాలు ఏర్పాటు చేయగా... రాచకొండ పరిధిలో సుమారు లక్ష వరకు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో జరిపే దర్యాప్తులోనూ ఎంతో పురోగతి ఉంటోంది. నేరాలు చేసిన వాళ్లు సీసీ కెమెరాల కంటపడటం వల్ల ఆ దృశ్యాలను సేకరించి న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నారు. దీంతో నిందితులకు న్యాయస్థానాల్లో శిక్షపడేలా పోలీసులు సఫలమవుతున్నారు. గతేడాది 42శాతం కన్విక్షన్ రేటు ఉండగా... 2017తో పోలిస్తే ఇది రెట్టింపయినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఎన్నో కీలక కేసులను చేధించారు..

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏడాది క్రితం పశ్చిమబెంగాల్‌కు చెందిన మహిళను హత్య చేసి గోనెసంచిలో కుక్కి.... గచ్చిబౌలిలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసిపోయారు. ఎంతో క్లిష్టమైన ఈ కేసును నిందితుడు ఉపయోగించిన ద్విచక్రవాహనం ఆధారంగా చేధించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్‌లోనూ చిన్నారి నరబలిని కేసు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. చిన్నారిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో అపహరించి... చిలుకానగర్​లో తన ఇంటికి కారులో తీసుకొచ్చిన దృశ్యాల ఆధారంగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అనంతరం సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు జరిపి క్షుద్రపూజల కోసం నరబలి చేసిన దంపతులను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా ఎన్నో కీలక కేసులను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఛేదించగలుగుతున్నారు.

ఇవీ చూడండి: మహిళల రక్షణ కోసం విజయవంతంగా 'సైబ్-హర్' కార్యక్రమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.