వాహనం నడిపే ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీసులు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు భద్రత వారోత్సవాలకు ఆయన హాజరై ప్రసంగించారు. గతంతో పోల్చుకుంటే రోడ్డు ప్రమాదాలు 3 శాతం తగ్గాయన్నారు. రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య తగ్గించేందుకు ఇంజినీరింగ్, జీహెచ్ఎంసీ మరియు ట్రాఫిక్‌వింగ్‌తో అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్‌వింగ్‌కి చాలా ప్రాముఖ్యత ఉందని, నగర భద్రతతోపాటు రోడ్డు ప్రమాద రహితంగా నగరాన్ని తీర్చిదిద్దుదామని ఆయన అన్నారు.
ప్రతి వాహనదారుడు అందరి గురించి ఆలోచించాలని, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. అందరి ప్రయాణం సుఖమయంగా సాగాలని ఆకాంక్షించారు. వాహన చోదకులు... పోలీసులకు సహకరించాలన్నారు. అందరి సమష్టి కృషి వల్లే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. పోలీసులు సైతం తమ వాహనాలను నడిపేటపుడు ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించాలన్నారు.
లారీ, ఆటో, బస్, టూ, త్రీ వీలర్ వాహనాల డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి : కరోనాపై ఆందోళన వద్దు... : మంత్రి ఈటల