హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కృషి చేయాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని పలు మసీదుల్లో తెరాస శ్రేణులు సోడియం హైడ్రోక్లోరైట్ స్ప్రే చేసే మిషన్లు అందజేశారు.
ఇందులో భాగంగానే పాతబస్తీలోని జామియా నిజామియా కళాశాలను సందర్శించిన నగర డిప్యూటీ మేయర్... ఆవరణలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదు ఆవరణలో సోడియం హైడ్రోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేశారు.