ETV Bharat / state

దటీజ్ ప్రసాద్: ఈ హైదరాబాదీ 77 వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కేశాడు! - 77 వేల కిలోమీటర్లు సైక్లింగ్​ చేసిన ప్రసాద్​ హైదరాబాద్

రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని ఒక భాగం చేస్తే శారీరక దృఢత్వంతో పాటు.. మానసిక ఉల్లాసం మన దరిచేరుతుంది. ఉరుకుల పరుగుల ఈ నగర జీవనంలో రోజులో కొద్దిపాటి వ్యాయామం మనల్ని చురుకైన వ్యక్తులుగా తయారు చేస్తుంది. ఇలా రోజూ చేసే వ్యాయామంలోనూ వ్యక్తిగత రికార్డులు కొల్లగట్టవచ్చని నిరూపిస్తున్నారు.. హైదరాబాద్​కు చెందిన ప్రసాద్ వడ్డేపల్లి. ఫిట్ నెస్ కోసం సైక్లింగ్ ఎంచుకొని.. 77 వేల కిలోమీటర్లు రైడ్​ చేసి దేశంలోనే ఈ ఘనత సాధించిన వ్యక్తిగా అరుదైన రికార్డు సాధించారు.

77 వేల కిలోమీటర్ల సైక్లింగ్​​.. దేశంలోనే తొలి భారతీయుడిగా ఘనత

author img

By

Published : Nov 14, 2020, 1:30 PM IST

Updated : Nov 14, 2020, 7:13 PM IST

దటీజ్ ప్రసాద్: ఈ హైదరాబాదీ 77 వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కేశాడు!

హైదరాబాద్​కు చెందిన ప్రసాద్ వడ్డేపల్లి వెయ్యి రోజుల్లో 77 వేల కిలోమీటర్లు రైడ్​ను పూర్తి చేసుకున్నారు. తొలి రోజుల్లో రోజుకు 50 కిలోమీటర్లు రైడ్ చేసిన ప్రసాద్.. తర్వాత దాన్ని రోజుకు వంద కిలోమీటర్లకు పెంచుకున్నారు. ఇలా 200 రోజులు వంద కిలోమీటర్ల చొప్పున సైక్లింగ్ చేశారు. ఉదయం 4.30 కు ప్రారంభమైన రైడ్ మూడు నుంచి నాలుగు గంటల పాటు సాగేదని ప్రసాద్ అంటున్నారు. ఇలా వెయ్యి రోజుల పాటు.. ఒ‍క్కరోజు విడవకుండా ఏకంగా 77 వేల కిలోమీటర్ల రైడ్ పూర్తి చేసి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు సంపాదించారు.

మొదట్లో 95 కేజీల బరువు ఉన్న ప్రసాద్.. బరువు తగ్గేందుకు సైక్లింగ్ ఎంచుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూపులో జాయిన్ అయ్యారు. 2017 లో సైక్లింగ్ ప్రారంభించిన ప్రసాద్.. 2018 నుంచి దీన్ని సీరియస్​గా తీసుకున్నారు. అలా 2018 లో హెచ్​సీజీ తరుఫున వంద రోజల ఛాలెంజ్, లిలే ఛాలెంజ్ వంటివి స్వీకరిస్తూ తన సత్తా చాటుకున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 600 మంది పాల్గొన్న ఇండియన్ సైక్లింగ్ లీగ్​లో సత్తా చాటి మొదటి వరసలో నిలిచారు. అలా 2018లో ఒక్కరోజు విడవకుండా సైక్లింగ్ పూర్తి చేసిన ప్రసాద్.. అదే ‍ఒరవడిని 2020 వరకు కొనసాగించాడు. కరోనా సమయంలోనూ, లాక్​డైన్ సమయంలోనూ ఇంటిమిద్దెపై సైక్లింగ్ చేసి, రైడర్ స్ఫూర్తిని కొనసాగించారు. ఇలా వెయ్యిరోజుల పాటు.. రోజు విడవకుండా సైక్లింగ్ చేసి క్రీడా స్ఫూర్తిని చాటిన ప్రసాద్​ను హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూపు అభినందించింది.

2017లో కేవలం ముగ్గురితో సైక్లిస్ట్​ గ్రూపు ప్రారంభమైంది. ఇప్పుడు గ్రూపులో వెయ్యి మంది దాకా సభ్యులున్నారు. 6 నుంచి 75 ఏళ్ల వయస్కులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. సైక్లింగ్​ను జీవనవిధానంలో ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని.. ఈ అద్భుతమైన స్పోర్ట్ ద్వారా హ్యాపీ హార్మోన్స్ విడుదలయ్యి ఫిజికల్ ఫిట్ నెస్​తోపాటు మెంటల్ హెల్త్ అభివృద్ధి చెందుతుందని హెచ్​సీజీ సభ్యులంటున్నారు. ప్రసాద్ సాధించిన ఘనత చాలా ప్రత్యేకమని.. ఈ సందర్భంగా ప్రసాద్​ను సత్కరించి.. మొమెంటో, సైకిల్, నగదు బహుమతితో సత్కరించారు. ఆయన నుంచి పలువురు స్ఫూర్తి పొందాలని వారన్నారు.

తన కుటుంబ సహకారం వల్లే ఈ రికార్డు సాధించానని.. రోజు ఉదయం 4 గంటల నుంచి దినచర్య ప్రారంభించి సైక్లింగ్ పూర్తి చేసి ఆఫీసుకు వెళ్లేవాడినని ప్రసాద్ తెలిపారు. మొదట్లో 95 కిలోల బరువున్న తాను ఇ్పపుడు 69 కేజీలకు తగ్గానని.. ఫిట్ నెస్​కు మించిన మానసిక ఉల్లాసం లేదని.. అది సైక్లింగ్ వల్ల కలుగుతోందని ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వం సైక్లింగ్ స్పోర్ట్​కు ప్రాధాన్యమిస్తూ.. పొల్యుషన్ ఫ్రీ, ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్ కోసం నలువైపులా సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ప్రసాద్​ కోరారు.

ఇదీ చదవండి: సైక్లింగ్​.. ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది : మర్రి లక్ష్మారెడ్డి

Last Updated : Nov 14, 2020, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.