ETV Bharat / state

'చిన్నారులపై 95 శాతం అత్యాచారాలు తెలిసిన వాళ్లే చేస్తున్నారు' - హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తాజా వార్తలు

CV Anand: చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల్లో 95శాతం మంది తెలిసిన వ్యక్తులే నిందితులుగా ఉంటున్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బంధువులు, చుట్టుపక్కల వారు, కొన్ని ఘటనల్లో కుటుంబ సభ్యులు కూడా లైంగిక దాడి చేసినట్లు కేసులు నమోదవుతున్నాయని ఆయన అన్నారు.

Hyderabad CP CV Anand
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
author img

By

Published : May 7, 2022, 3:53 PM IST

CV Anand: చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల్లో తెలిసిన వ్యక్తులే నిందితులుగా ఉన్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. కుటుంబ పరువును దృష్టిలో ఉంచుకొని లైంగిక దాడుల విషయాలను గోప్యంగా ఉంచుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే తగిన న్యాయం చేయడానికి వీలవుతుందని చెప్పారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న భరోసా కేంద్రం వార్షికోత్సవ కార్యక్రమంలో సీవీ ఆనంద్ పాల్గొన్నారు.

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడుల నియంత్రణ కోసం భరోసా కేంద్రాలు ఎంతో కష్టపడుతున్నాయని సీపీ తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే దాడులు... నేరాలు, మాదక ద్రవ్యాల విషయంలో మీడియా కొంత సంయమనం పాటించాలని సూచించారు. భరోసా కేంద్రం అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని జెండా ఊపి సీవీ ఆనంద్, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి దివ్య ప్రారంభించారు.

ఇదీ చదవండి: రెండో రోజు పర్యటనలో బిజిబిజీగా రాహుల్​.. నేతలతో విస్తృత స్థాయి సమావేశం..

నీటిపై తేలియాడే వంతెన.. సముద్రంపై నడిచేయండిక...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.