ETV Bharat / state

కరోనాను జయించిన పోలీసులకు సీపీ ప్రశంసలు

విధి నిర్వహణలో ఉండగా..  కరోనా వ్యాధికి గురై.. చికిత్స పూర్తి చేసుకొని, వ్యాధిని జయించి తిరిగి విధులకు హాజరైన పోలీసు సిబ్బందిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అభినందించారు. వారికి ప్రశంస పత్రాలు, బహుమతులు అందజేశారు.

Hyderabad CP Anjani kumar Gives Prizes to police staff who cured from corona virusv
కరోనాను జయించిన పోలీసులకు సీపీ ప్రశంసలు
author img

By

Published : Jul 16, 2020, 4:37 PM IST

లాక్​డౌన్​, కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విధులు నిర్వహించి కరోనా బారిన పడి.. తిరిగి కోలుకొని విధులకు హాజరవుతున్న పోలీసులను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్​ ప్రశంసించారు. వారికి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించారు. పాతబస్తీ పేట్ల బుర్జులోని హైదరాబాద్ సిటీ ఆర్మ్​డ్​ రిజర్వ్ హెడ్ కార్టర్​లో కరోనా వ్యాధి నుండి కోలుకుని విధులకు హాజరైన 62 మంది పోలీస్ సిబ్బందికి స్వాగతం, అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్ హాజరయ్యారు.

వైరస్​ను జయించిన పోలీస్ సిబ్బందిని అభినందించి వారికి ప్రశంస పత్రాలతో పాటు బహుమతులను అందజేశారు, వ్యాధిని జయించిన పోలీస్ సిబ్బంది వారి అనుభవాలను తెలుపుతూ ఉన్నతాధికారులు తమకు అండగా ఉండి.. ధైర్యం చెప్పిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీ అంజనీకుమార్​తో పాటు హైదరాబాద్ అదనపు సీపీ డీఎస్ చౌహాన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్​ అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.