మానసిక వికలాంగులైన పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికితీస్తున్న రౌంట్ టేబుల్ ఇండియా సంస్థ కృషి అభినందనీయమని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు.
బాలల దినోత్సవం పురస్కరించుకుని.. ఈ సంస్థ చేపట్టిన 'తారే జమీన్ పర్' రేఖాచిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తమ రేఖా చిత్రాలు గీసిన విద్యార్థులకు అంజనీకుమార్ బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పిల్లల నృత్యాలు ఆకట్టుకున్నాయి. 12 సంవత్సరాలుగా మానసిక విగలాంగులకు పలు రకాల పోటీలు నిర్వహిస్తూ వారిలో స్ఫూర్తి నింపుతున్నామని నిర్వాహకులు వెల్లడించారు.
- ఇదీ చూడండి : కాళేశ్వరం నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ