తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం రూపురేఖలే మారిపోయాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు వివరించారు.
హైదరాబాద్ విశ్వ నగరంగా ముందుకెళ్తోందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఉప్పల్ కూడలిలో సుమారు రూ. 28 లక్షలతో చేపట్టిన సుందరీకరణ, అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వై. సుభాష్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్లతో కలిసి మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. నగరంలోని 15 ప్రధాన కూడళ్ళలో అభివృద్ధితో కూడిన సుందరీకరణ పనులను చేపట్టినట్టు తెలిపారు.
ఇదీ చూడండి : రైతుపై బ్యాంక్ సిబ్బంది దాడి.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు