వర్షాకాలంలో వరద ముంపు ప్రభావాన్ని అధిగమించేందుకు నగరంలో అధిక నిధులు వెచ్చిస్తున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. ఎల్బీనగర్ జోన్‌లో రూ.11.45 కోట్లతో మూడు ఆర్‌సీసీ బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నగరంలో అనేక నూతన రహదారులు నిర్మించామని... నాలాలు అన్నీ శుభ్రపరిచినట్లు వెల్లడించారు.
ఎల్బీనగర్ సర్కిల్లోని హస్తినాపురం శ్రీనగర్ కాలనీ నుంచి గాయత్రినగర్ వరకు రూ.5.25 కోట్లతో ఆర్‌సీసీ బాక్స్ డ్రెయిన్ నిర్మించనున్నట్లు తెలిపారు. నగరంలో ముంపు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పలు కాలనీల్లో ముంపును నివారించేందుకు యుద్ధ ప్రాతిపాదికన పనులు చేస్తున్నట్లు వివరించారు.