కొవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల ఏటా అంగరంగ వైభవంగా జరిగే గణేశ్ ఉత్సవాలు సాదాసీదాగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేశ్ తర్వాత ఎంతో ప్రాశస్త్యం కలిగిన బాలాపూర్ గణనాథుడి ఉత్సవాలు సాధారణంగా జరగనున్నాయి. పాతికేళ్ల బాలాపూర్ చరిత్రలో తొలిసారి లడ్డువేలం లేకుండా వేడుకలు ముగింపు జరగనుందని నిర్వాహకులు ప్రకటించారు. వినాయక చవితి సందర్భంగా.. బాలాపూర్ గణనాథుని ప్రాంగణం నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు.
పాతికేళ్ల చరిత్రలో లడ్డూ వేలం లేకుండా బాలాపూర్ గణేశ్ ఉత్సవాలు
కొవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని.. బాలాపూర్లో ఈసారి గణేశ్ ఉత్సవాలను సాధారణంగా నిర్వహిస్తామని బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రకటించింది. హైదరాబాద్లో ఖైరతాబాద్ తర్వాత ఎంతో ప్రాశస్త్యం కలిగిన బాలాపూర్ గణనాథుడు ఈసారి ఆరు ఆడుగుల్లో దర్శనమివ్వనున్నారు.
పాతికేళ్ల చరిత్రలో లడ్డూ వేలం లేకుండా బాలాపూర్ గణేశ్ ఉత్సవాలు
కొవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల ఏటా అంగరంగ వైభవంగా జరిగే గణేశ్ ఉత్సవాలు సాదాసీదాగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేశ్ తర్వాత ఎంతో ప్రాశస్త్యం కలిగిన బాలాపూర్ గణనాథుడి ఉత్సవాలు సాధారణంగా జరగనున్నాయి. పాతికేళ్ల బాలాపూర్ చరిత్రలో తొలిసారి లడ్డువేలం లేకుండా వేడుకలు ముగింపు జరగనుందని నిర్వాహకులు ప్రకటించారు. వినాయక చవితి సందర్భంగా.. బాలాపూర్ గణనాథుని ప్రాంగణం నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు.
Last Updated : Aug 23, 2020, 7:46 AM IST