ETV Bharat / state

విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే:విహెచ్​ - vh

ఇంటర్​ ఫలితాల అవకతవకలపై విచారణ జరిపించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్​ఎప్​ఐ డీవైఎఫ్​ఐ నాయకులు చేపట్టిన దీక్షకు పలువురు సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్​ ఆర్టీసీ క్రాస్​ రోడ్డులో ఎస్​ఎఫ్​ఐ కార్యాలయంలో దీక్ష శిబిరాన్ని కాంగ్రెస్​ నేత వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్​ సందర్శించారు.

విద్యార్థి సంఘనాయకులతో విహెచ్​​
author img

By

Published : May 6, 2019, 4:10 PM IST

ఇంటర్ ఫలితాలు అవకతవకలపై హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఎస్ఎఫ్ఐ డీవైఎఫ్ఐ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. దీక్ష శిబిరాన్ని కాంగ్రెస్​ నేత వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్​ సందర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రెండేళ్లలో కుప్పకూలాలని పెద్దమ్మ తల్లిని కోరుకున్నట్లు విహెచ్​ చెప్పారు. ప్రభుత్వం ఇంటర్ ఫలితాల విషయంలో తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థుల ఆత్మహత్యలపై తప్పుడు ప్రచారాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు.

విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే:విహెచ్​
ఇవీ చూడండి: కేరళ బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్

Intro:విద్యార్థి అవకతవకలపై ఎస్ ఎఫ్ ఐ డి వై ఎఫ్ ఐ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది

Body:ఇంటర్ అవకతవకలపై ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులను తప్పు పడుతున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంత రావు అన్నారు.. ఇంటర్ ఫలితాలు అవకతవకలపై హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది... ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన వి హనుమంత రావు విద్యార్థి సంఘ నాయకులను కలిసి సంఘీభావం ప్రకటించారు కేటీఆర్ బఫూన్ అని తనపై చేస్తున్న వాక్యాలను ను ఖండిస్తూ తాను బఫూన్ అవుతే మీ తండ్రికి కెసిఆర్ కూడా బహు అని, అది మర్చిపోవద్దని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు... కెసిఆర్ ప్రభుత్వం రెండేళ్లలో కుప్ప కులాలని పెద్దమ్మ దేవాలయం లో కోరుకున్నట్లు విహెచ్ చెప్పారు.... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ర్ మనుషుల అక్రమ రవాణా విషయం మరిచారా ఆయన నిలదీశారు.. ఇంటర్ విద్యార్థుల ప్రాణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఇవి ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వ హత్యలేనని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వం కమిటీ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విధానాలను మలుచుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం వన్ ఇంటర్ ఫలితాల విషయంలో తప్పిదాలు మీద దాడి చేస్తూ విద్యార్థుల ఆత్మహత్యల పై తప్పుడు ప్రచారాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఉన్నారు పారదర్శకత లేని ఇంటర్ ఫలితాల మూల్యాంకనం సరిదిద్దుకోవాల్సి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను వంగబెట్టి వారి ఉజ్వల భవిష్యత్తుకు విఘాతం కలిగిస్తుందని ఆయన మండిపడ్డారు ఇంటర్ బోర్డు కమిషనర్ను, విద్యా శాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు....

బైట్..... వి హనుమంతు రావు రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు
బైట్...... నాగేశ్వర్ మాజీ ఎమ్మెల్సీ

Conclusion:విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు విచ్చేసి తమ సంఘీభావం ప్రకటించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.